Netflix Users Share Password : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై పాస్‌వర్డ్ షేర్ చేస్తే.. ఎక్స్‌ట్రా డబ్బులు చెల్లించాల్సిందే.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!

Netflix Users Share Password : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. రెండు చౌకైన ప్లాన్‌లను అందిస్తోంది. బేసిక్ లేదా స్టాండర్డ్ విత్ యాడ్స్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ల ధర వరుసగా నెలకు 9.99 డాలర్లు (రూ. 830), 6.99 డాలర్లు (రూ. 589)గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్లపై అదనంగా మరో సభ్యుడిని యాడ్ చేసుకునే అవకాశం లేదు.

Netflix Users Share Password : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై పాస్‌వర్డ్ షేర్ చేస్తే.. ఎక్స్‌ట్రా డబ్బులు చెల్లించాల్సిందే.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!

Netflix will let you share password with friends only if you pay extra

Netflix Users Share Password with friends only : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) యూజర్లకు అలర్ట్.. మీ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ ఎవరితోనైనా షేర్ చేస్తున్నారా? అయితే ఆగండి.. లేదంటే మీ జేబులకు చిల్లు పడటం ఖాయం.. ఎందుకంటే.. నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ చేసిన వినియోగదారులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకే అకౌంట్‌పై ఎక్కువ మంది యాక్సస్ చేసుకోవడాన్ని నెట్‌ఫ్లిక్స్ అనుమతించడం లేదు.

అందుకే.. అదనంగా చెల్లించాల్సిందేనంటూ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇప్పటికే చాలా దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్ విధానానికి స్వస్తి పలికింది. ప్రస్తుతం అమెరికాలోని నెట్‌ఫ్లిక్స్ యూజర్‌లు తమ అకౌంట్ (పాస్‌వర్డ్)ని స్నేహితులు, లేదా కుటుంబ సభ్యులకు షేర్ చేయడానికి అనుమతి లేదు. ప్రైమరీ అకౌంట్‌దారు తమ కుటుంబంతో పాటు స్నేహితులతో పాస్‌వర్డ్ షేర్ చేస్తే అదనంగా చెల్లించాల్సిందేనని నెట్‌ఫ్లిక్స్ తేల్చి చెప్పింది.

పాస్‌వర్డ్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ నిషేధం :
ఇప్పటికే స్ట్రీమింగ్ కంపెనీ ఎంచుకున్న లాటిన్ అమెరికన్ దేశాలలో పాస్‌వర్డ్ షేరింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది. గత ఫిబ్రవరిలో కెనడా, న్యూజిలాండ్, పోర్చుగల్, స్పెయిన్‌లలో ఇదే ప్రయోగాన్ని విస్తరించింది. అయితే, నెట్‌ఫ్లిక్స్ తన యాడ్-సపోర్టు ప్లాన్‌లతో దేశంలో తమ యూజర్ బేస్ పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతానికి భారత మార్కెట్లో ఈ కొత్త విధానం అందుబాటులో లేదు. అయితే, అమెరికాలోని నెట్‌ఫ్లిక్స్ ప్రైమరీ ఖాతాదారుడు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో అకౌంట్ షేర్ చేయాలనుకుంటే ఇప్పుడు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ బ్లాగులో వెల్లడించింది.

నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ అనేది ఒక ఫ్యామిలీకి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ ఇంటిలో నివసించే ప్రతిఒక్కరూ ఎక్కడ ఉన్నా ఇంట్లో లేదా ప్రయాణంలో, సెలవుల్లో నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్ యాక్సస్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ప్రొఫైల్ యాక్సెస్, డివైజ్‌లు, ట్రాన్స్‌ఫర్ వంటి కొత్త ఫీచర్‌ల బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

Read Also : JioFiber Broadband Plan Offers : జియోఫైబర్ యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ బెస్ట్ ప్లాన్లపై అన్‌లిమిటెడ్ డేటా, మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్..!

పాస్‌వర్డ్ షేరింగ్‌కు ఎంత అదనంగా చెల్లించాలంటే? :
నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు తమ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఒకే ఇంట్లో నివసిస్తున్న వారితో షేర్ చేసుకోవచ్చునని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. అందుకోసం వినియోగదారులు నెలకు 7.99 డాలర్లు (దాదాపు రూ. 661) చెల్లించాలి. ఈ ధర అమెరికా మార్కెట్‌కు మాత్రమే ప్రత్యేకమైనదిగా కంపెనీ చెబుతోంది. నెట్‌ఫ్లిక్స్ మార్కెట్‌ల ఆధారంగా విభిన్న వ్యూహాలను అనుసరిస్తుందని గమనించాలి. నెట్‌ఫ్లిక్స్ రెండు చౌకైన ప్లాన్‌లను కలిగి ఉంది.

ఈ ప్లాన్లను వినియోగదారులు బేసిక్ లేదా స్టాండర్డ్ విత్ యాడ్స్ ఆధారంగా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ల ధర వరుసగా నెలకు 9.99 డాలర్లు (రూ. 830), 6.99 డాలర్లు (రూ. 589) చెల్లించాల్సి ఉంటుంది. మరో సభ్యుడిని చేర్చుకోవడానికి అవకాశం లేదని నివేదిక తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్ (నెలకు 15.49 డాలర్లు లేదా రూ. 1,290) ఉన్న వినియోగదారులు ప్రతి నెలా 7.99 డాలర్లు అదనంగా చెల్లించి మరో సభ్యుడిని చేర్చుకోవచ్చు.

Netflix will let you share password with friends only if you pay extra

Netflix Users Share Password with friends only if you pay extra

నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ చెల్లిస్తే.. :
నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లను కలిగిన వినియోగదారులు 4K ప్లేబ్యాక్‌ని పొందవచ్చు. నెలకు 7.99 డాలర్లు ఇద్దరు అదనపు సభ్యులను అకౌంట్లో యాడ్ చేసుకోవచ్చు. యూకేలో కూడా Netflix ఈ అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోంది. అప్పుడు వినియోగదారులు GNB 4.99 (దాదాపు రూ. 510) చెల్లించాలి. ఇక, నెట్‌ఫ్లిక్స్ సెట్టింగుల మెనులో ‘manage access and devices’కి వెళ్లడం ద్వారా ఫ్రీలోడర్‌లను చెక్ చేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉపయోగించి అన్ని డివైజ్‌లను చెక్ చేయవచ్చు.

నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు ఇతరులతో అకౌంట్లను షేర్ చేసుకోవద్దని సూచించింది. ఇలానే జరిగితే నెట్‌ఫ్లిక్స్ చివరి త్రైమాసిక ఫలితాల్లో కంపెనీపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని కంపెనీ భావించింది. అయితే, కంపెనీ దీర్ఘకాలంలో వృద్ధిని అంచనా వేస్తోంది. జనాభా పరిమాణం, అధిక స్మార్ట్‌ఫోన్ స్వీకరణ రేటు కారణంగా కంపెనీ భారీ వృద్ధిని చూస్తోంది. భారత్ వంటి దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ కంపెనీకి భిన్నమైన వ్యూహం అవసరం కావచ్చు. నెట్‌ఫ్లిక్స్ సహ-CEO టెడ్ సరండోస్ కూడా ఫిబ్రవరిలో (IB) మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చూసే కంటెంట్ భారతీయ ప్రాంతీయ కంటెంట్ మాత్రమేననిసరందోస్ కేంద్ర మంత్రితో చెప్పారు.

Read Also : Amazon Employees Walk Off : అమెజాన్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి.. ఆఫీసుకు రాలేమంటే తొలగిస్తారా? విధుల నుంచి వాకౌట్‌కు టెకీల ప్లాన్..!