Stock Market : దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనం.. 750 పాయింట్లకుపైగా నష్టపోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లకుపైగా నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 200 పాయింట్లు తగ్గి.. 17090 పాయింట్లకు చేరింది. అలాగే రూపాయి సైతం మరింత బలహీనపడి రూ.82.64 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది.

Stock Market : దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనం.. 750 పాయింట్లకుపైగా నష్టపోయిన సెన్సెక్స్

Stock market

stock market : దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లకుపైగా నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 200 పాయింట్లు తగ్గి.. 17090 పాయింట్లకు చేరింది. అలాగే రూపాయి సైతం మరింత బలహీనపడి రూ.82.64 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇవాళ మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 767 పాయింట్లు పడిపోయి 57,424 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

అలాగే నిఫ్టీ 205 పాయింట్లు క్షీణించి.. 17,103 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. మార్కెట్‌లో బ్యాంక్, ఆటో, మెటల్ రంగాల షేర్లలో నష్టాల్లో కనిపించగా.. సెన్సెక్స్ బెంచ్‌మార్క్‌లో ప్రారంభ ట్రేడ్‌లో 30 స్టాక్స్‌లో అన్నీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 57,498.35, నిఫ్టీ 17,101.9 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Rupee Falls: మరింత పతనమైన రూపాయి విలువ.. డాలరుతో అత్యంత కనిష్టానికి చేరిక.. నష్టాల్లో స్టాక్ మార్కెట్

మరోవైపు ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. స్ట్రెయిట్‌ టైమ్స్‌ 3,106, హాంగ్‌సెంగ్‌ 17,298, నిక్కీ 27,116.11 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. టాప్‌ గెయినర్స్‌గా యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ నిలిచాయి. టాటా మోటార్స్‌, హీరోమోటోకార్ప్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.