Nykaa ఉద్యోగుల జాక్‌పాట్.. ఏకంగా రూ.850 కోట్లు సంపాదన

ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీ.. డిజిటల్ బ్యూటీ, వెల్‌నెస్, ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ నైకా ఉద్యోగులు జాక్ పాట్ కొట్టారు. వారిపై కనక వర్షం కురవనుంది. వంద కాదు 200 కాదు.. ఏకంగా రూ.850 కోట్లు

Nykaa ఉద్యోగుల జాక్‌పాట్.. ఏకంగా రూ.850 కోట్లు సంపాదన

Nykaa

Nykaa : ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీ.. డిజిటల్ బ్యూటీ, వెల్‌నెస్, ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ నైకా ఉద్యోగులు జాక్ పాట్ కొట్టారు. వారిపై కనక వర్షం కురవనుంది. వంద కాదు రెండు వందలు కాదు.. ఏకంగా రూ.850 కోట్లు సంపాదించనున్నారు.

మ్యాటర్ ఏంటంటే.. నైనా అక్టోబర్‌ 28న ఐపీవోకి వెళ్లనుంది. నైకా మాతృ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌ కామర్స్ వెంచర్స్ దాని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం ఒక్కో షేర్ ధరను రూ. 1,085 నుంచి రూ. 1,125కు నిర్ణయించింది. మూడు రోజుల పబ్లిక్ ఆఫర్ నవంబర్ 1న ముగియనుంది. దీంతో కంపెనీలోని పలువురు ఉన్నత ఉద్యోగులు భారీగా డబ్బు సంపాదించనున్నారు. నైకాలోని ఆరుగురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులు తమ షేర్‌ హోల్డింగ్స్‌, వెస్టెడ్‌ ఆప్షన్ల ద్వారా మొత్తంగా రూ. 850 కోట్లను ఆర్జించనున్నారు.

Five Drinks For Weight Loss : బరువు తగ్గడానికే కాదు..జీవక్రియకు ఉపయోపడే ఐదు అద్భుత పానీయాలు

నైకాలో వివిధ విభాగాలకు ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌లు నాయకత్వం వహిస్తున్నారు. నైకా ప్రైవేట్ లేబుల్ విభాగం ఎఫ్‌ఎస్‌ఎన్‌ బ్రాండ్స్ సీఈవో రీనా ఛబ్రా కంపెనీలో 2.1 మిలియన్ షేర్లను, 0.12 మిలియన్ ఉద్యోగుల స్టాక్ ఆప్షన్‌లతో సుమారు రూ. 250 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. రీనా ఛబ్రా మే 2016 నుంచి ఎఫ్‌ఎస్‌ఎన్‌ బ్రాండ్స్‌తో అనుబంధాన్ని కలిగి ఉన్నారు.

* నైకా, మ్యాన్‌ బిజినెస్‌ సీఈవో నిహిర్ పారిఖ్ కంపెనీలో 2 మిలియన్లకు పైగా షేర్లను కలిగి ఉండగా.. వీటితో రూ. 245 కోట్లను సంపాదించే అవకాశం ఉంది.
* పారిఖ్‌ 2015 నుంచి నైకాలో పని చేస్తున్నారు. ఏడాదికి రూ. 2.83 కోట్ల జీతాన్ని అందుకుంటున్నారు.
* నైకా ఈ-రిటైల్‌ సీటీవో సంజయ్ సూరి కంపెనీలో సుమారు 1.8 మిలియన్ షేర్లను కలిగి ఉండగా…దీంతో రూ.220 కోట్లను ఐపీవో ద్వారా సంపాదించుకోనున్నారు.
* కంపెనీ ఈ-రిటైల్‌ చీఫ్ సప్లయ్ చైన్ ఆఫీసర్ మనోజ్ జైస్వాల్ దగ్గర రూ.63 కోట్ల విలువైన షేర్లను కలిగున్నారు.
* కంపెనీ సీఎఫ్‌వో అరవింద్ అగర్వాల్ రూ. 45 కోట్ల విలువైన షేర్లను కలిగున్నారు.
* నైకా ఫ్యాషన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోపాల్ అస్థానా రూ. 29 కోట్ల విలువైన షేర్లను కలిగున్నారు.

ORS : ప్రమాణాలు పాటించని ఓఆర్ఎస్ తో జాగ్రత్త!..

నైకాలో అందరికన్నా ముందుగా పెట్టుబడులు పెట్టింది హరిందర్ సింగ్ బంగా, ఇంద్రా బంగా. తొలుత 2014లో రూ.120 కోట్లు (యావరేజ్ ప్రైస్ రూ.56.64) ఇన్వెస్ట్ చేశారు. వారి వాటా విలువ ఒక్కసారిగా 18 ఫోల్డ్ పెరిగింది. ప్రస్తుతం ఐపీవో వ్యాలుయేషన్ సమయానికి రూ.2వేల 383 కోట్లుగా ఉంది.