Inmates Killed: జైలు నుంచి తప్పించుకున్న ‘ఐ లవ్ యూ’ సహా మరో ముగ్గురు ఖైదీలు.. కొట్టి చంపిన గ్రామస్థులు

జైళ్ల శాఖ ఐజీపీ జేకే మారక్ చెప్పిన వివరాల ప్రకారం.. జోవాయ్ జైలు నుంచి ఆరుగురు ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. అండర్ ట్రయల్ ఖైదీలైన వీరిలో ఐదుగురు షాంగ్ పుంగ్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి కాస్త దూరంలోని అడవిలో తలదాచుకున్నారు. చాలా సమయం నుంచి తిండి లేకపోవడంతో గ్రామంలోకి వెళ్లి ఏదైనా తెచ్చుకోవాలని అనుకున్నారు. ఇదే వారి ప్రాణం మీదకు తీసుకువచ్చింది

Inmates Killed: జైలు నుంచి తప్పించుకున్న ‘ఐ లవ్ యూ’ సహా మరో ముగ్గురు ఖైదీలు.. కొట్టి చంపిన గ్రామస్థులు

4 Inmate Lynched by Mob After Escaping Prison in Meghalaya

Inmates Killed: జైలు శిక్ష అనుభవించలేక గోడదూకి పారిపోబోయిన ఖైదీలు గ్రామస్థులు దొరికి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కర్రలు, రాళ్లతో దాడి చేసి నలుగురు ఖైదీలను హతమార్చారు. మేఘాలయలోని పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లాలో జరిగిందీ సంఘటన. ఖైదీలు మేఘాలయలోని జోవాయ్ జైలుకు చెందిన వారు. వాస్తవానికి ఆరుగురు ఖైదీలు తప్పించుకుంటే ఐదుగురు గ్రామస్థుల కంట పడ్డారు. దాడి నుంచి ఒక వ్యక్తి తప్పించుకుని పారిపోగా.. నలుగురు మాత్రం ప్రజల ఆగ్రహానికి ఆహుతయ్యారు.

జైళ్ల శాఖ ఐజీపీ జేకే మారక్ చెప్పిన వివరాల ప్రకారం.. జోవాయ్ జైలు నుంచి ఆరుగురు ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. అండర్ ట్రయల్ ఖైదీలైన వీరిలో ఐదుగురు షాంగ్ పుంగ్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి కాస్త దూరంలోని అడవిలో తలదాచుకున్నారు. చాలా సమయం నుంచి తిండి లేకపోవడంతో గ్రామంలోకి వెళ్లి ఏదైనా తెచ్చుకోవాలని అనుకున్నారు. ఇదే వారి ప్రాణం మీదకు తీసుకువచ్చింది. తప్పించుకున్న ఖైదీల్లో ఒకరు టీ షాపుకు రావడంతో స్థానికులు అతన్ని ఖైదీగా గుర్తించి గ్రామస్థులను అప్రమత్తం చేసినట్లు ఆ గ్రామ పెద్ద ఆర్ రాబన్ చెప్పారు.

జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు అటవీప్రాంతంలో దాక్కున్నారని తెలుసుకొని గ్రామస్థులు ఆగ్రహంతో కర్రలు పట్టుకొని వెళ్లి వారిపై దాడికి దిగారు. గ్రామస్థల దాడిలో నలుగురు ఖైదీలు మరణించగా, మరొక ఖైదీ పారిపోయాడు. ఆరవ ఖైదీ సైతం కనిపించడం లేదని జైలు అధికారులు తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. చనిపోయిన నలుగురు ఖైదీల్లో ఒకతని పేరు ‘ఐ లవ్ యూ తలంగ్’ అని పోలీసులు పేర్కొన్నారు.

Artemis 1: మూడోసారి లాంచింగ్‭కు సిద్ధమైన అర్టెమిస్-1.. ఈసారైనా సక్సెస్ అయ్యేనా?