Artemis 1: మూడోసారి లాంచింగ్‭కు సిద్ధమైన అర్టెమిస్-1.. ఈసారైనా సక్సెస్ అయ్యేనా?

ఈ ప్రయోగం అనంతరం 2024లో ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం చేపట్టాలని నాసా నిర్ణయించుకుంది. అందులో వ్యోమగాములను స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి పంపిస్తారు. కానీ వారు చంద్రుడి మీద దిగకుండా వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణానికి ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎంతవరకు అనుకూలంగా ఉంటుందనే అంశాలను మాత్రమే పరిశీలిస్తారు. ఈ రెండు ప్రయోగాల ముగిశాక 2025లో ‘ఆర్టెమిస్-3’ ప్రయోగం చేపడతారు

Artemis 1: మూడోసారి లాంచింగ్‭కు సిద్ధమైన అర్టెమిస్-1.. ఈసారైనా సక్సెస్ అయ్యేనా?

artemis 1 rocket ready to launch for third time

Artemis 1: రెండుసార్లు ప్రయోగం వరకు వచ్చి సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన అర్టెమిస్-1 రాకెట్ ప్రయోగం ముచ్చటగా మూడోసారి ప్రయోగానికి సిద్ధమైంది. రెండు సార్లు జరిగిన లోపాలను సరిదిద్ది ఎలాంటి లోపాలు లేకుండా లాంచింగ్‭కు సిద్ధం చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్థ నాసా తెలిపింది. మొదటిసారి ఆగస్టు 30న ప్రయోగానికి సిద్ధం చేశారు. అయితే ఇంధన ట్యాంకులో వచ్చిన సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని ప్రయోగాన్ని వాయిదా వేశారు. అనంతరం ఈ నెల 3న రెండవసారి నింగికి పంపేందుకు సిద్ధం చేశారు. ఈసారి కూడా ఇంధన ట్యాంకులో సమస్య కారణంగా వాయిదా వేశారు. ఇక తాజాగా మూడోసారి అర్టెమిస్-1 ప్రయోగానికి సిద్ధమైంది. అయితే గత పరిణామాల నేపథ్యంలో ఈసారైనా సక్సెస్ అవుతుందా అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.

అర్టెమిస్ అంటే..? ఈ ప్రయోగం దేనికి..?
చంద్రుడిపై మనిషి అడుగుపెట్టిన యాబై ఏళ్ల తర్వాత తిరిగి చంద్రుడి మీదకు మనుషులను పంపించే ప్రయోగాలకు తాజాగా నాసా శ్రీకారం చుట్టింది. ఈసారి ఈ ప్రయోగాలకు ‘ఆర్టెమిస్’ అని పేరు పెట్టింది. గ్రీకు పురాణగాథల ప్రకారం ఆర్టెమిస్ అంటే ఒక చంద్ర దేవత అని అర్థం. అందులో భాగంగా ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ‘ఆర్టెమిస్ 1’ ప్రయోగాన్ని ప్రారంభిస్తోంది. ఇందులో మనుషులెవరినీ పంపించకుండా కొత్త రాకెట్, కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌ల పనితీరును, వాటి భద్రతను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.

ఈ ప్రయోగం అనంతరం 2024లో ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం చేపట్టాలని నాసా నిర్ణయించుకుంది. అందులో వ్యోమగాములను స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి పంపిస్తారు. కానీ వారు చంద్రుడి మీద దిగకుండా వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణానికి ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎంతవరకు అనుకూలంగా ఉంటుందనే అంశాలను మాత్రమే పరిశీలిస్తారు. ఈ రెండు ప్రయోగాల ముగిశాక 2025లో ‘ఆర్టెమిస్-3’ ప్రయోగం చేపడతారు. ఈ ప్రయోగంలో వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపిస్తారు. 2030ల నాటికి అంగారకుడి మీదకు అంతరిక్షయాత్రికులను పంపించటానికి సంసిద్ధమయ్యే క్రమంలో భాగంగా నాసా ఈ మూన్ మిషన్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు కనిపిస్తోంది.

Russia-Ukraine War: ఉక్రెయిన్ ధాటికి తోకముడిచిన రష్యా.. ఆయుధాలు వదిలి పారిపోయిన రష్యా సైన్యం