10th Girl Suicide: చెంపదెబ్బ కొట్టిన ప్రిన్సిపల్.. విద్యార్థిని సూసైడ్!

ఈరోజుల్లో పిల్లలు.. యువత చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించినా.. టీచర్లు బెదిరించినా ఓర్చుకోలేకపోతున్నారు. చిన్న కారణాలతో తనువు చాలించి కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నారు. స్కూల్ లో ప్రిన్సిపల్ చెంపదెబ్బ కొట్టడంతో అవమానంగా భావించిన టెన్త్ క్లాస్ విద్యార్థిని ఉరేసుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది.

10th Girl Suicide: చెంపదెబ్బ కొట్టిన ప్రిన్సిపల్.. విద్యార్థిని సూసైడ్!

Girl Suicide

10th Girl Suicide: ఈరోజుల్లో పిల్లలు.. యువత చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించినా.. టీచర్లు బెదిరించినా ఓర్చుకోలేకపోతున్నారు. చిన్న కారణాలతో తనువు చాలించి కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నారు. స్కూల్ లో ప్రిన్సిపల్ చెంపదెబ్బ కొట్టడంతో అవమానంగా భావించిన టెన్త్ క్లాస్ విద్యార్థిని ఉరేసుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద సంఘటన ఢిల్లీకి సమీపంలోని గుర్‌గావ్‌లో జరిగింది. కరోనా విజృంభణ నేపథ్యంలో గుర్‌గావ్‌లో స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. అయితే.. ఓ పాఠశాల మాత్రం యథేచ్ఛగా స్కూల్ తెరవడమే కాకుండా అన్యాయంగా ఒక బాలిక ప్రాణాలను బలితీసుకుంది.

ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఓ 15 ఏండ్ల బాలిక పొడవైన చెవిపోగులు ధరించి స్కూల్ కు వెళ్ళింది. మందలించేందుకు పిలిచిన ప్రిన్సిపల్ కు ఆమె వద్ద మొబైల్ కంటపడింది. అంతేకాదు ఆమె గోర్లు పొడవుగా పెంచుకోవడం కూడా ప్రిన్సిపల్ కు ఆగ్రహాం తెప్పించింది. మొత్తంగా ప్రిన్సిపాల్‌ తోటి విద్యార్థుల ఎదుటే ఆ బాలికను తిట్టడంతో పాటు ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో అవమానంగా భావించిన బాలిక స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ముభావంగా ఉంటూ ఎవరితో మాట్లాడలేదు. దీంతో తల్లిదండ్రులు బాలికను సముదాయించి ప్రిన్సిపల్ తో మాట్లాడేందుకు వెళ్లారు.

తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్ ను బ్రతిమాలినా ఆయన వినకపోగా అమ్మాయి పేరును రోల్స్‌ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. దీంతో తల్లిదండ్రులు మా అమ్మాయిని మరోసారి ఇలా చేయకుండా హెచ్చరిస్తామని ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేందుకు వీలుగా రోల్స్‌ నుంచి పేరు తొలగించవద్దని ప్రాధేయ పడ్డారు. కనికరం చూపని ప్రిన్సిపల్ అదే పాఠశాలలో చదువుతున్న వారి కుమారుడిని కూడా తొలగిస్తామని హెచ్చరించి వారిని వెళ్లిపొమ్మన్నాడు. దాంతో వారు చేసేదేంలేక ఇంటికి వెళ్లిపోయారు.

బాలికకు జరిగిన విషయం చెప్పిన తల్లిదండ్రులు మరోసారి ప్రిన్సిపల్ ను కలిసి రోల్స్ నుండి పేరు తొలగించకుండా చూస్తామని ధైర్యంచెప్పే ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత బాలిక పై అంతస్థులోని గదికెళ్లి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ్ముడు ఈ విషయం గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించగా వెంటనే ఆమెను సమీపంలోని దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. బాలిక మేనమామ ఫిర్యాదు మేరకు సదరు ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.