నెల రోజుల్లో 77మంది శిశువులు మృతి : ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష

రాజస్థాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల మృత్యుఘోష వినిపిస్తోంది. అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారులు శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నారు. 48 గంటల వ్యవధిలోనే 10 మంది

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 08:39 AM IST
నెల రోజుల్లో 77మంది శిశువులు మృతి : ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష

రాజస్థాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల మృత్యుఘోష వినిపిస్తోంది. అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారులు శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నారు. 48 గంటల వ్యవధిలోనే 10 మంది

రాజస్థాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల మృత్యుఘోష వినిపిస్తోంది. అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారులు శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నారు. 48 గంటల వ్యవధిలోనే 10 మంది శిశువులు మృతి చెందారు. తల్లులకు తీరని గర్భశోకం మిగులుతోంది. కోటలోని జేకేలాన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ 23న ఆరుగురు, డిసెంబరు 24న నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. డాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ముగ్గురు నిపుణులతో కమిటీ వేసింది. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెండ్‌ మీనా స్పందించారు. ‘సాధారణంగా ఆసుపత్రిలో రోజుకు ఒకటి, రెండు మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ 48 గంటల్లో 10మంది చిన్నారులు మరణించడం బాధాకరం. అయినా సాధారణమే. చాలా వరకు శిశువుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లాలని కోరతాము’ అని తెలిపారు.

అయితే ఆక్సిజన్‌ అందక, ఇన్‌ఫెక్షన్‌ కారణంగా, పలు కారణాలతో శిశువులు పుట్టిన 48 గంటల్లోనే మృతి చెందారని ఓ డాక్టర్ తెలిపారు. కాగా, జేకేలాన్ ఆసుపత్రిలో డిసెంబర్ నెలలోనే 77మంది శిశువులు మృతి చెందడం సంచలనంగా మారింది. 2019 ఏడాదిలో 940మంది శిశువులు మృత్యువాత పడ్డారు.

Also Read : పాకిస్తాన్ వెళ్లిపోండి : ఆందోళనకారులపై SP ఆగ్రహం