సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం

సికింద్రాబాద్ నుంచి అమరావతి వెళ్లే ఇంటర్ సిటీ ట్రైన్ లో బాంబు కలకలం రేపింది. రైల్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రైన్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే ఆపేశారు. బాంబ్

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 02:31 AM IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం

సికింద్రాబాద్ నుంచి అమరావతి వెళ్లే ఇంటర్ సిటీ ట్రైన్ లో బాంబు కలకలం రేపింది. రైల్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రైన్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే ఆపేశారు. బాంబ్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం రేగింది. సికింద్రాబాద్ నుంచి అమరావతి వెళ్లే ఇంటర్ సిటీ రైలులో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రైన్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే ఆపేశారు. బాంబ్ స్వ్కాడ్ సిబ్బంది ట్రైన్ మొత్తం తనిఖీలు చేసింది. అరగంట సేపు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానిత వస్తువులు కనిపించలేదని అధికారులు తెలిపారు. బాంబు లేదని నిర్ధారించారు. దీంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు లేదని తేలడంతో ట్రైన్ అమరావతి బయల్దేరింది. 

ఫేక్ కాల్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాఫ్తు చేపట్టారు. అయితే.. సడెన్ గా ట్రైన్ నిలిపేసి, హడావుడిగా పోలీసులు వచ్చి తనికీలు చేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డారు. బాంబు ఉందని తెలిసి టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత ఎలాంటి బాంబు లేదని పోలీసులు నిర్ధారించడంతో ప్రయాణికులు రిలాక్స్ అయ్యారు.

* సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం
* అమరావతి ఇంటర్ సిటీ రైల్లో బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్
* అరగంట సేపు ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు

* ఇంటర్ సిటీ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే నిలిపివేసిన రైల్వే పోలీసులు
* రైలులో తనిఖీలు నిర్వహించిన బాంబు స్వ్కాడ్
* బాంబు లేదని నిర్ధారించిన బాంబ స్వ్కాడ్
* ఫేక్ కాల్ అని గుర్తించిన పోలీసులు