ఆ సినిమా చూసి.. తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు.. తండ్రి నుంచి డబ్బులు డిమాండ్..

  • Published By: sreehari ,Published On : November 11, 2020 / 09:59 PM IST
ఆ సినిమా చూసి.. తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు.. తండ్రి నుంచి డబ్బులు డిమాండ్..

fake own kidnapping : బెంగళూరులో కిడ్నాప్ నాటకమాడిన ఓ 16ఏళ్ల కుర్రాడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ డ్రామాలు ఆడాడు.. కన్నడ మూవీని స్ఫూర్తిగా తీసుకున్న బాలుడు తనకు తానే కిడ్నాప్ అయ్యాడు. తన తల్లిదండ్రుల నుంచి రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు.



తల్లిదండ్రుల ఫిర్యాదుతో పిల్లాడి ప్లాన్ అడ్డం తిరిగింది. కిడ్నాప్ డ్రామాను ఛేదించిన పోలీసులు ఏపీలోని తిరుపతిలో బాలుడిని అరెస్ట్ చేశారు. బాలుడి పేరును అక్షయ్ గా మార్చడం జరిగింది. అక్షయ్ తండ్రి సొంత టెక్స్ టైల్ షాపులో పనిచేస్తున్నాడు. నవంబర్ 6న ఇంట్లో నుంచి బైక్ మీద బయటకు వెళ్లాడు.

ఆ తర్వాత కొన్ని ఫొటోలు పంపి తాను కిడ్నాప్ అయినట్టు తల్లిదండ్రులను నమ్మించాడు. బెంగళూరుకు చేరుకోగానే తన బైకును పార్క్ చేసి సమీపంలోని మెట్రో స్టేషన్ లో రైలెక్కేశాడు. మేజిస్టిక్ చేరుకున్నాక అనంతరం అక్షయ్.. బస్సులో తిరుపతికి చేరుకున్నాడు. అక్కడే ఒక లాడ్జ్ లో ఉన్నాడు.



తన కుమారుడు అదృశ్యమయ్యాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ ద్వారా కుమారుడి ఫొటోగ్రాఫ్ తండ్రి ఫోన్ కు వచ్చింది. ఆ ఫొటోలో తన చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. కుమారుడిని విడిచిపెట్టాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.



వాట్సాప్ మెసేజ్ ఆధారంగా పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి టీనేజర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వచ్చిన మెసేజ్ లొకేషన్ ఆధారంగా తిరుపతిలోని ఓ లాడ్జీలో బాలుడు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తిరుపతికి వెళ్లిన పోలీసుల బృందం బాలుడిని అరెస్ట్ చేసింది.



కిడ్నాప్ నాటకంపై పోలీసులు విచారించగా.. తల్లిదండ్రుల నుంచి డబ్బులు కోసం ఇలా ఫేక్ కిడ్నాప్ నాటకం ఆడానని బాలుడు అంగీకరించాడు. స్కూల్ లేకపోయినా తనను చదువుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, తనకు ఆసక్తి లేదని తెలిపాడు. కన్నడ మూవీలోని Alamelamma ఆపరేషన్ సీన్ ఆధారంగా కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు పోలీసులు చెప్పాడు.