Ram Gopal Yadav: అతిక్ అహ్మద్ పిల్లలందర్నీ చంపేస్తారేమో అంటున్న ఎస్పీ ఎంపీ రాంగోపాల్

ముందస్తుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం జరిగిన అత్యంత కిరాతకమైన హత్య ఇది. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా జరిగింది. దర్యాప్తు సంస్థలు కనుక దీనిపై నిక్కచ్చి విచారణ చేస్తే ముసుగులో ఉన్న అనేక మంది బయటికి వస్తారు

Ram Gopal Yadav: అతిక్ అహ్మద్ పిల్లలందర్నీ చంపేస్తారేమో అంటున్న ఎస్పీ ఎంపీ రాంగోపాల్

SP MP Ram Gopal

Ram Gopal Yadav: వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా.. ప్రయాగ్‌రాజ్‌లోని ఎంఎల్ఎన్ మెడికల్ కాలేజీ ఆవరణలోనే పోలీసులు, మీడియా మధ్యనే మాజీ ఎంపీ, గ్యాంగ్‭స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‭ను కిరాతకంగా కాల్చి చంపారు. దీనికి రెండు రోజుల ముందు అతిక్ అహ్మద్ కుమారుడు ఆసిఫ్ అహ్మద్ సైతం పోలీసులు ఎన్‭కౌంటర్‭లో చనిపోయాడు. కాగా, మిగిలిన అతిక్ సంతానాన్ని చంపేస్తారేమో అంటూ సమాజ్‭వాదీ పార్టీ నేత ఎంపీ రాంగోపాల్ యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆసిఫ్ కాకుండా మరో నలుగురు సంతానం ఉన్నారు. అయితే వారు కూడా హత్యకు గురవుతారేమోనని రాంగోపాల్ యాదవ్ అన్నారు.

Atiq Ahmed: అతీక్ అహ్మద్ మామూలోడు కాదు.. ఈ ఫొటో చూడండి మీకే తెలుస్తుంది!

ఈ విషయమై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ముందస్తుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం జరిగిన అత్యంత కిరాతకమైన హత్య ఇది. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా జరిగింది. దర్యాప్తు సంస్థలు కనుక దీనిపై నిక్కచ్చి విచారణ చేస్తే ముసుగులో ఉన్న అనేక మంది బయటికి వస్తారు’’ అని రాంగోపాల్ యాదవ్ అన్నారు. ఇలాంటి అనుమానాల్ని నెటిజెన్లు పెద్ద ఎత్తున లేవనెత్తుతున్నారు. ఉద్దేశపూర్వకంగా జరిగిందంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారు.

Atiq Ahmed Murder: హత్యకు ముందు అతీక్ అహ్మద్ మాట్లాడిన చివరి మాటలు ఇవే

అతీక్ అహ్మద్, అతడి సోదరుడు పోలీసుల మధ్యలో మీడియా కెమెరాల ముందు దారుణ హత్యకు గురయ్యారు. వాళ్లను ఆ సమయంలో పోలీసులు గొలుసులతో కట్టేసి ఉండడాన్ని వీడియోల్లో చూడవచ్చు. వారి చుట్టూ పోలీసులు, మీడియా ప్రతినిధులు, లైవ్ కెమెరాలు ఉండగానే.. పాయింట్ బ్లాకులోకి వచ్చి కాల్చి చంపడంపై అనేక అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంత బహిరంగంగా వచ్చి కాల్చి చంపడమేంటని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటే అంత ధైర్యం చేసేవారు కారంటూ నేతలు, నెటిజెన్లు విమర్శిస్తున్నారు.