Atiq Ahmed: అతీక్ అహ్మద్ మామూలోడు కాదు.. ఈ ఫొటో చూడండి మీకే తెలుస్తుంది!

ములాయం సింగ్ యాదవ్ తో మాఫియా- బాహుబలి అతీక్ అహ్మద్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Atiq Ahmed: అతీక్ అహ్మద్ మామూలోడు కాదు.. ఈ ఫొటో చూడండి మీకే తెలుస్తుంది!

Atiq Ahmed: దుండగుల చేతిలో హతమైన యూపీ మాఫియా – బాహుబలి అతీక్ అహ్మద్ మామూలోడు కాదని అతడి చరిత్ర చెబుతోంది. చిన్నతనంలోనే నేరాల బాట పట్టిన అతడు అలహాబాద్‌ (Allahabad) కేంద్రంగా తన మాఫియా కార్యకలాపాలు కొనసాగించాడు. రాజకీయ పార్టీల దన్నుతో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడని, అతడు ఇంతకాలం చట్టం నుంచి తప్పించుకుని తిరగడానికి పొలిటికల్ పవరే కారణమని క్లియర్ గా తెలుస్తోంది. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్ సభకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ అండతోనే అతడు ఎదిగాడని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి.

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(mulayam singh yadav).. అతీక్ అహ్మద్ ను రాజకీయాల్లో బాగా ప్రోత్సహించారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ములాయం అండతోనే అతడు చెలరేగిపోయాడని అంటున్నారు. ములాయం సింగ్ యాదవ్ తో అతీక్ అహ్మద్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ తన ట్విటర్ లో ఈ ఫొటోను షేర్ చేశారు.

అతీక్ అహ్మద్ పెంపుడు శునకానికి ములాయం సింగ్ యాదవ్ (mulayam singh yadav) షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటో ఇది. తన పెంపుడు కుక్కను ములాయం వద్దకు తీసుకొచ్చిన అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అజీమ్ అహ్మద్ కూడా ఈ ఫొటోలో ఉన్నారు. అతీక్ అహ్మద్ పెంపుడు శునకంతో కరచాలనం చేయడాన్ని గర్వంగా ములాయం భావించారని బ్రిజ్ లాల్(brij lal) ట్విటర్ లో పేర్కొన్నారు. అతీక్ అహ్మద్ కు సమాజ్‌వాదీ పార్టీ అండదండలు ఎంతగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క ఫొటో సరిపోతుందని అన్నారు.

Atiq Ahmed Story: అతిక్ అహ్మద్ హత్య.. కుప్పకూలిన నేర సామ్రాజ్యం

కాగా, అతీక్ అహ్మద్(Atiq Ahmed), అతడి సోదరుడు అజీజ్ ను పోలీసుల సమక్షంలోనే దుండులు హత్య చేయడాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. యూపీలో నేరాలు శిఖర స్థాయికి చేరాయని, పోలీసులను సైతం లెక్కచేయకుండా క్రిమినల్స్ నేరాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సాధారణ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) కూడా అతీక్, అజీజ్ హత్యాకాండపై స్పందించారు. ఉత్తరప్రదేశ్ ఎన్ కౌంటర్ల రాష్ట్రంగా మారుతోందని విమర్శించారు.

Atiq Ahmed Murder: హత్యకు ముందు అతీక్ అహ్మద్ మాట్లాడిన చివరి మాటలు ఇవే