Police not controlled 2 sheeps : పోలీసులకు తలనొప్పి…ఒక్కో పోట్టేలుకు ఒక్కో పోలీసు కాపలా

సంక్రాంతి టైమ్ లో కోడి పందాల శిబిరాలపై దాడి చేసి కోళ్లను స్టేషన్ కు తెస్తే అదంతా కోళ్ల అరుపులతో గొడవ గొడవగా ఉంటుంది. వాటినంటే తాడుతో కట్టేస్తే ఏదో ఒక మూల పడుంటాయి. కానీ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో పొట్టేళ్లు పందేల పై దాడిచేయగా పట్టుకొచ్చిన పొట్టేళ్లను అదుపు చేయటానికి ఒక్కో పొట్టేలు దగ్గర ఒక్కో కానిస్టేబుల్ ను నియమించాల్సి వచ్చింది.

Police not controlled 2 sheeps : పోలీసులకు తలనొప్పి…ఒక్కో పోట్టేలుకు ఒక్కో పోలీసు కాపలా

Police Not Controlled 2 Sheeps

banjara hills police not controlled 2 sheeps : సంక్రాంతి టైమ్ లో కోడి పందాల శిబిరాలపై దాడి చేసి కోళ్లను స్టేషన్ కు తెస్తే అదంతా కోళ్ల అరుపులతో గొడవ గొడవగా ఉంటుంది. వాటినంటే తాడుతో కట్టేస్తే ఏదో ఒక మూల పడుంటాయి. కానీ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో పొట్టేళ్లు పందేల పై దాడిచేయగా పట్టుకొచ్చిన పొట్టేళ్లను అదుపు చేయటానికి ఒక్కో పొట్టేలు దగ్గర ఒక్కో కానిస్టేబుల్ ను నియమించాల్సి వచ్చింది.

బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని హకీంపేటలో శుక్రవారం అక్రమంగా పొట్టేళ్ల పోటీలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచిరెండు పొటీ పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నారు.వాటిని సంరక్షించటం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.

పోటీ పొట్టేళ్లు చాలా బలిష్టంగా ఉంటాయి. ఇవి పొట్టిగా ఉన్నా…ఒక్కోసారి ఇవి ఆరడుగులు హైట్ ఎగిరి మనిషి తలను ఢీకొట్టగలవు. వాటి దెబ్బకు మనుషులు స్పృహతప్పి పోతారు. తాళ్లతో కట్టేసినా వాటిని తెంచుకుని పారిపోయేంత బలం ఉంటుంది. వీటిని అదుపు చేయలేక… పోలీసు స్టేషన్ లో ఉన్న ఒక్కో సిమెంట్ బెంచికి ఒక్కో పొట్టేలును కట్టేసివాటి వద్ద ఒక్కోకానిస్టేబుల్ ను నియమించారు.

వీటిని వెటర్నరీ హాస్పటల్ లో అప్పగించేంతవరకు పోలీసులకు తలప్రాణం తోకకు వచ్చినట్లైంది. వీటిపేర్లు ఒకదాని పేరు వీర్.. మరో పొట్టేలు పేరు మాలిక్.పొట్టేళ్ల పోటీలు నిర్వహిస్తున్న 15మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారివద్దనుంచి 60వేల రూపాయల నగదుస్వాధీనం చేసుకున్నారు.