Payel Sarkar : బుల్లి‌తెర నటికి ప్రముఖ డైరెక్టర్ పేరుతో వేధింపులు

ప్రముఖ డైరెక్టర్ పేరుతో ఒక వ్యక్తి తనకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడని బెంగాలీ బుల్లితెర నటి పాయల్ సర్కార్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Payel Sarkar : బుల్లి‌తెర నటికి ప్రముఖ డైరెక్టర్ పేరుతో వేధింపులు

Payel Sarkar

Payel Sarkar : ప్రముఖ డైరెక్టర్  పేరుతో ఒక వ్యక్తి తనకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడని బెంగాలీ బుల్లితెర నటి పాయల్ సర్కార్    సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పశ్చిమ బెంగాల్‌కు  చెందిన బుల్లితెర నటి పాయల్‌ సర్కార్‌కు సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి ఫ్రెండ్‌  రిక్వెస్ట్‌ పంపించాడు.

అతడి ప్రొఫైల్‌ ఓపెన్‌ చేసి చూస్తే ప్రముఖ బెంగాలీ దర్శకుడు రవి కినాగి ఫొటోలు కనిపించాయి.  దీంతో పాటు ఆ దర్శకుడి సినిమాలకు సంబంధించిన వివరాలు, వర్కింగ్ స్టిల్స్ కూడా ఉండటంతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన వ్యక్తి  నిజంగానే దర్శకుడే అని నమ్మి, నటి ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసింది.

దీంతో అతడు మాటలు కలుపుతూ.. చాటింగ్‌లో తన త్వరాతి ప్రాజెక్ట్ లో ఆమెకు ప్రధాన పాత్ర ఇప్పిస్తానని  ఆశ చూపించాడు. అందుకు ఆమె సంతోషించే లోపే నీచమైన మెసేజ్‌లు చేయడం మొదలెట్టాడు. దీంతో పాయల్‌కు   అది డైరెక్టర్‌ అకౌంటేనా? లేక ఫేక్‌ అకౌంటా? అన్న సందేహం వచ్చింది.  ఆ అనుమానానికి ఆజ్యం పోస్తూ అతను వరుసగా అసభ్య సందేశాలు పంపసాగాడు.

వెంటనే ఆమె ఆ మెసేజ్‌లను   స్క్రీన్‌ షాట్లు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. అతడి ప్రొఫైల్‌ చూసిన ఆమె అభిమానులు, స్నేహితులు వాళ్లు దాన్ని ఫేక్‌ అకౌంట్‌ అని తేల్చారు.  దీంతో ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.  బరక్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.  పాయల్ సర్కార్ తపూర్ తుపూర్, అందర్ మహల్, బెనెబౌ, తమీ రబే నిరోబ్ వంటి సీరియల్స్ లో ప్రముఖ పాత్ర పోషించారు.

కాగా…. పాయల్ ఫిర్యాదు తర్వాత నకిలీ ఖాతా డీ యాక్టివేట్ చేయబడిందని.. దానిని క్రియేట్ చేసిన  వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు తన పేరుతో ఫేక్ ఎకౌంట్లు తెరిచి మహిళలను వేధిస్తున్న  వారిపై చర్యలు తీసుకోవాలని  పోలీసులకు పిర్యాదు చేస్తానని డైరెక్టర్ రవి కినాగి చెప్పారు.