Hot Actress Nandita Dutta : సినిమాల్లో ఛాన్స్ లిప్పిస్తానని పోర్న్ చిత్రాలకు ఒత్తిడి…నాన్సీభాబీ అరెస్ట్

Hot Actress Nandita Dutta : సినిమాల్లో ఛాన్స్ లిప్పిస్తానని పోర్న్ చిత్రాలకు ఒత్తిడి…నాన్సీభాబీ అరెస్ట్

Nandita Dutta

Hot Actress Nandita Dutta :  బాలీవుడ్‌లో రాజ్‌కుంద్రా నీలి చిత్రాల నిర్మాణం సృష్టించిన ప్రకంపనలు   తగ్గక ముందే    మరో పోర్న్ చిత్రాల నిర్మాణ రాకెట్ వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్ లో గుట్టుచప్పుడు    కాకుండా పెద్దల చిత్రాల నిర్మాణ   వ్యవహారాలను నడిపిస్తున్న ఓ మోడల్-కమ్-నటిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కూపీ లాగుతున్నారు.

బెంగాలీ సినిమాల్లో నటించే వర్ధమాన నటి, మోడల్ నందితా దత్తా (30) ఒకప్పుడు బిజీ మోడల్ చాలా కాలంగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సరైన సినిమా ఛాన్స్ లు దొరక్క బీగ్రేడ్ సినిమాల్లో, వెబ్ సిరీస్ బోల్డ్ కంటెంట్ , పోర్నోగ్రఫీ సినిమాల్లో   నాన్సీభాబీ పేరిట నటించటం మొదలెట్టింది.

ఈ సినిమాలతో   బీజీగా ఉంటున్న నందితా తనకున్న పరిచయాలతో యంగ్ మోడల్స్‌కు  వెబ్ సిరీస్‌ల్లో అవకాశలిప్పిస్తానని  చెప్పింది.  ఆమె మాటలు నమ్మి ముందుకువచ్చిన మోడల్స్ ను నీలి చిత్రాల్లో నటించాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు   బాధితురాళ్లు ఇచ్చిన  ఫిర్యాదుతో పోలీసులు కోల్‌‌కతా‌లోని   డండం.. నక్‌టాలా లోని కొన్ని ఇళ్లలో శుక్రవారం ఏకకాలంలో దాడులు చేశారు. నక్‌టాలా లోని ఒక ఇంట్లో  ఉంటున్న మోడల్‌ను   పోర్న్ చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేస్తున్న నందితాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరో వైపు డండం లోని మరో ఇంట్లో ఆమె అనుచరుడు మైనక్ ఘోష్ పర్యవేక్షణలో జరుగుతున్న పోర్న్ చిత్రం షూటింగ్ పై దాడిచేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు ఆశ చూపి పోర్న్ చిత్రాల్లో నటింప చేస్తోందని… ఎదురు తిరిగితే తన మనుషులతో చంపిస్తానని బెదిరిస్తోందని ఆఇద్దరు మోడల్స్ ఆరోపణలు చేశారు.

అంతేకాక  బాలీగుంజేలోని  ఓ ప్రైవేట్‌ స్టూడియోలో తనపై అఘాయిత్యం జరిగిందని ఒక నటి జూలై 26న న్యూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  ఈ భారీ పోర్న్ రాకెట్‌లో నందితతో పాటు మైనక్ ఘోష్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇది భారీ సెక్స్ రాకెట్ అని పోలీసులు భావిస్తున్నారు. వీరికి రాజ్‌కుంద్రాతో ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా నందిత, మైనక్ ఘోష్ ల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నిస్తున్నారు.