ఫ్యాక్టరీలో టపాసులు పేలి 10 మంది మృతి

  • Published By: madhu ,Published On : February 23, 2019 / 11:43 AM IST
ఫ్యాక్టరీలో టపాసులు పేలి 10 మంది మృతి

దేశంలో ఉగ్ర టెర్రర్ నెలకొన్న సందర్భంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బదోహీలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. మరో ఉగ్రదాడి జరిగిందా ? అనే అనుమానాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనాలు కుప్పకూలడంతో భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. ఉగ్రవాదులే బాంబులు పేల్చారనే పుకార్లు షికారు చేశాయి. అయితే బాంబు దాడులు కాదని, అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. 

బదోహి జిల్లాలోని రోహతా బజార్‌ ఉలిక్కి పడింది. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం మధ్యాహ్నం కార్పెట్ తయారు చేసే కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. రెండంతస్తుల భవనం కుప్పకూలిపోగా..పక్కనే ఉన్న మరో మూడు నివాసాలు నేలకూలాయి. 10 మంది అక్కడికక్కడనే చనిపోయారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని తెలుస్తోంది.
Read Also: ఓట్ల సర్వే చిచ్చు : యర్రావారిపాలెంలో హై టెన్షన్

పక్కనే ఉన్న స్థానికులు, సమాచారం అందుకున్న రెస్క్యూటీం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందం చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుడు ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని వస్తువులను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. 
Read Also: కాంగ్రెస్ గో బ్యాక్: బస్సు యాత్రను అడ్డుకున్న వైసీపీ

కార్పెట్ తయారీ కోసం తీసుకుని అక్రమంగా బాణాసంచా పేలుడు తయారు చేస్తున్నారని ఐజీ పీయూష్ శ్రీవాస్తవ వెల్లడించారు. మందుగుండు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని, ఆ సమయంలో కొంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారని వెల్లడించారు. ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఐజీ పేర్కొన్నారు. చనిపోయిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Read Also: వాళ్లకు వ్యతిరేకం కాదు.. కశ్మీర్ కోసమే చేస్తున్నా: మోడీ