Yanamalakuduru: యనమలకుదురు హత్య కేసులో ట్విస్ట్.. ఆ మూడో వ్యక్తి ఎవరు?

యనమలకుదురులో భార్య, భర్త కలిసి ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. వీరితో పాటు మూడో వ్యక్తి ప్రమేయం ఉందని హతుడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

Yanamalakuduru: యనమలకుదురు హత్య కేసులో ట్విస్ట్.. ఆ మూడో వ్యక్తి ఎవరు?

yanamalakuduru murder case probe

Yanamalakuduru Case: కృష్ణా జిల్లా (Krishna District) పెనమలూరు (Penamaluru) మండలం యనమలకుదురులో జరిగిన హత్య కేసులో హతుడు పురుషోత్తం మృతదేహం లభ్యంకాకపోవడంతో మిస్టరీ కొనసాగుతూనే ఉంది. తన తమ్ముడి మృతదేహాన్ని గోదావరి నదిలో (Godavari River) పడేశారన్నది అబద్దమని పురుషోత్తం అన్నయ్య నాగేశ్వరరావు అంటున్నారు. బుధవారం ఆయన 10టీవీతో మాట్లాడుతూ.. తన తమ్ముడి మృతదేహాన్ని నిందితులు ఎక్కడో దాచిపెట్టారని ఆరోపించారు. తన హత్య కేసులో మూడో వ్యక్తి ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి హంతకులకు శిక్ష పడేలా చేయాలని కోరారు.

అసలేం జరిగింది?
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని (Vijayawada) అజిత్ సింగ్ నగర్ (Ajit Singh Nagar) ప్రాంతానికి చెందిన గ్రంధి పురుషోత్తం (41) జులై 31న కనిపించకుండా పోయాడు. దీంతో అతడి సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. పురుషోత్తం హత్యకు గురైనట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పురుషోత్తం స్నేహితుడు మొహిందర్, అతడి భార్య శశికళ కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. పురుషోత్తాన్ని యనమలకుదురులోని తమ ఇంటికి తీసుకెళ్లి మద్యం తాగించి చంపేసినట్టు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ ఘతుకానికి పాల్పడినట్టు విచారణలో నిందితులు వెల్లడించారు. పురుషోత్తం మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ (Dowleswaram Barrage) వద్దకు తీసుకెళ్లి గోదావరిలో పడేసినట్టు పోలీసులతో చెప్పారు. పురుషోత్తం వద్ద నుంచి కాజేసిన బంగారు ఆభరణాలను నిందితులు గుంటూరులో అమ్మేసినట్టు పోలీసులు గుర్తించి.. వాటిని రికవరీ చేశారు. కాగా, మొహిందర్, శశికళ ప్రేమ వివాహాన్ని పురుషోత్తం దగ్గరుండి జరిపించడం గమనార్హం.

హతుడి అన్నయ్య ఏమన్నారంటే..
“గత నెల 31న మా తమ్ముడు మొహిందర్ ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. హత్య చేసి ఏమీ ఎరగనట్టు మొహిందర్ మా వెనకాలే తిరిగాడు. ఈ హత్య వెనుక మొహిందర్ తో పాటు మరి కొంత మంది ఉన్నారు. పెనమలూరు పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు. హత్యకు ఉపయోగించిన కారుని ఇప్పటివరకు పోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? మూడు అంతస్తుల పై నుంచి మొహిందర్ ఒక్కడే మా తమ్ముడిని కిందకు దించలేడు. మా తమ్ముడు 90 కేజీల పైనే బరువు ఉంటాడు.

Also Read: సెల్ ఫోన్లు కొట్టేసి.. ఐఎంఈఐ నంబర్ మార్చేసి అమ్మేస్తున్న కిలాడీ అరెస్ట్

తన భార్యతో కలిసి హత్య చేసినట్టు తమ ముందు నిందితుడు ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. భార్యా, భర్తలిద్దరితో పాటు మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ మూడో వ్యక్తి ఎవరనేది పోలీసుల విచారణలో తేల్చాలి. పోలీసులకు మొహిందర్ చెప్పేవన్నీ అబద్ధాలే. నా తమ్ముడి మృతదేహాన్ని ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో పడేశారన్నది పూర్తిగా అవాస్తవం. మృతదేహాన్ని ఇక్కడే ఎక్కడో దాచి పెట్టారు. మా తమ్ముడి మృతదేహం ఎక్కడ ఉందో నిందితులు కచ్చితంగా చెప్పడం లేదు. పెనమనూరు పోలీసులు మాకు న్యాయం చేయకపోతే కృష్ణా జిల్లా ఎస్పీని కలుస్తాం. మా తమ్ముడి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం”

Also Read: వామ్మో.. మొగుడికి సినిమా చూపించింది.. పదేళ్లలో ఏడుసార్లు భర్తను అరెస్ట్ చేయించిన భార్య