Balapur : పెళ్లి చేసుకుని గంట కూడా కాలేదు..డబ్బు తీసుకుని ప్రియుడితో జంప్

పెళ్లి చేసుకుని కనీసం గంట కూడా గడవలేదు.. భర్తను వదిలి ప్రియుడితో కలిసి చెక్కేసింది ఓ పెళ్లికూతురు..

Balapur : పెళ్లి చేసుకుని గంట కూడా కాలేదు..డబ్బు తీసుకుని ప్రియుడితో జంప్

Marrige

Balapur : పెళ్లి చేసుకుని కనీసం గంట కూడా గడవలేదు.. భర్తను వదిలి ప్రియుడితో కలిసి చెక్కేసింది ఓ పెళ్లికూతురు.. వెళ్లిపోయేప్పుడు.. ఖాళీగా వెళ్లకూడదనుకుందో? ఏమో?.. భర్త ఇచ్చిన డబ్బులు, నగదును కూడా ఎత్తుకెళ్లిపోయింది. హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో జరిగిందీ ఘటన.

Read More : Ravi Shastri : ఐసోలేషన్‌లో ఒక్క పారాసిటమాల్ వేసుకోలేదు – రవిశాస్త్రి

బెంగుళూరుకు చెందిన మహమద్ ఇలియాస్‌కు పాతబస్తీలోని సమ్రిన్‌ బేగంతో వివాహమైంది. పెళ్లికి ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. పెళ్లికూతురుకు రెండు లక్షల యాబై వేల రూపాయల నగదుతో పాటు నగలను కూడా ఇచ్చాడు ఆ పెళ్లికొడుకు. అంతా సజావుగానే నడిచింది. వివాహం కూడా జరిగిపోయింది. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చింది పెళ్లికూతురు.

Read More : General Sherman tree : 2,300 ఏళ్ల వయస్సున్న భారీ వృక్షానికి అల్యూమినియం కవర్

పార్లర్‌కు వెళ్లి వస్తామని చెప్పి.. డబ్బు, నగలతో ప్రియుడితో కలిసి పరార్‌ అయ్యింది.  గంటలు గడుస్తున్నా పెళ్లి కూతురు రాలేదు.. అనుమానం వచ్చిన పెళ్లికొడుకు ఇంట్లో వారిని నిలదీశాడు.. దీంతో అసలు బండారం బయటపడింది. పెళ్లి కూతురు మేనత్త, చిన్నమ్మలు ఆమెను ప్రియుడితో పంపించేశారు. వెంటనే పెళ్లికొడుకు తన డబ్బు, నగలను ఇచ్చేయాలని లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దానిని సెటిల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు పెళ్లికూతురు బంధువులు.