Brother Kills Sister : ఫోన్‌లో వీడియోలు చూస్తోందని చెల్లిని హత్య చేసిన అన్న

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం జరిగింది. ఫోన్ లో వీడియోలు చూస్తోందని చెల్లిని కత్తితో పొడిచి చంపాడు అన్న.

Brother Kills Sister : ఫోన్‌లో వీడియోలు చూస్తోందని చెల్లిని హత్య చేసిన అన్న

Brother Kills Sister

Brother Kills Sister : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం జరిగింది. ఫోన్ లో వీడియోలు చూస్తోందని చెల్లిని కత్తితో పొడిచి చంపాడు అన్న. సుధలై అనే వ్యక్తి తూత్తుకుడి జిల్లాలోని వల్లనాడు సమీపంలోని వాసవంపురంలో నివాసం ఉంటున్నాడు. సుధలై ఓ రైతు. అతడికి కొడుకు మలైరాజా(20), కూతురు కవిత(17) ఉన్నారు. కవిత ప్లస్ టూ చదువుతోంది. కాగా, మలైరాజా తన చెల్లి కవితకు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. అయితే కవిత క్లాసులు వినకుండా.. సెల్‌పోన్‌లో వీడియోలు చూడటం మొదలుపెట్టింది. ఈ విషయమై మలైరాజా పలుమార్లు చెల్లిని హెచ్చరించాడు. అలా చేస్తే నీకు ముప్పు అని చెల్లికి చెప్పాడు.

ప్రతి రోజు దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎంత చెప్పినా వినకుండా వీడియోలు చూస్తోందని కోపానికి లోనైన మలైరాజా.. కవితను వెనుక నుంచి కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలైన కవిత మృతి చెందింది. ఆ తర్వాత మలైరాజా అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. వల్లానాడు సమీపంలో రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.