పెళ్ళి పేరుతో యువతి మోసం….సహకరించిన మహిళా ఎస్సైతో సహా మరో ముగ్గురిపై కేసు నమోదు

పెళ్ళి పేరుతో యువతి మోసం….సహకరించిన మహిళా ఎస్సైతో సహా మరో ముగ్గురిపై కేసు నమోదు

Case registered against three persons, including a woman SI, for filing a case with false allegations : పెళ్ళి పేరుతో పరిచయం అయిన మహిళ ఒక వ్యాపారస్తుడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలులో ఉన్నసమయంలో ఆవ్యక్తి తాలూకా క్రెడిట్ కార్డు ఉపయోగించి కేసు పెట్టిన ఎస్సై జల్సాలు చేశాడు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజసింహన్ వ్యాపారం నిమిత్తం తమిళనాడులోని కొయంబత్తూరులో స్ధిరపడ్డాడు. 2018లో ఉమారాణి అనే మహిళ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా రాజసింహ కు పరిచయం అయ్యింది. వారిద్దరూ ఫోన్ లోమాట్లాడుకోవటం చాటింగ్ చేయటం మొదలెట్టారు. అప్పటికే ఒకసారి వివాహం అయిన ఉమారాణి ఆవిషయాన్ని దాచిపెట్టి రాజసింహన్ తో చాటింగ్ చేయనారంభించింది.

ఈ క్రమంలో ఒకసారి ఉమారాణి రాజసింహన్ ను హైదరాబాద్ రమ్మని కోరింది. ఆమె కోరిక మన్నించి హైదరాబాద్ వచ్చిన రాజసింహన్ హోటల్ లో దిగాడు. ఇద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సన్నిహితంగా మెలిగారు. ఉమారాణి, రాజసింహన్ సన్నిహితంగా మెలిగిన సమయంలో అతనికి తెలియకుండా ఉమారాణి వీడియో తీసింది.

ఆ వీడియో ఆధారంగా… రాజసింహన్ తిరిగి కోయంబత్తూరు వెళ్లేలోపు ఉమారాణి చెన్నైలోని మహిళా పోలీసు స్టేషన్లో అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై జ్ఞాన సెల్వం రాజసింహన్ ను అదుపులోకి తీసుకున్నాడు. అతడ్ని చెన్నైలోని థౌజండ్ లైట్స్ పోలీసు స్టేషన్ లో ఉంచారు.

ఆసమయంలో అతని వద్ద ఉన్నక్రెడిట్ కార్డుల, డెబిట్ కార్డులు జ్ఞాన సెల్వం స్వాధీనం చేసుకున్నాడు. రాజసింహన్ జైలులో ఉన్న సమయంలో అతని క్రెడిట్, డెబిట్ కార్డులను ఇన్స్పెక్టర్ జ్ఞానసెల్వం ఇష్టం వచ్చి నట్టు ఖర్చుపెట్టాడు. వాటితో టికెట్లు తీసుకుని భార్యా పిల్లలతో విదేశాలకు వెళ్లి వచ్చాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చాక రాజసింహన్ పై కేసు లేకుండా వదిలేయటానికి అతని వద్ద నుంచి రూ. 28 లక్షలు లంచం తీసుకుని వదిలేశాడు.

జైలు నుంచి బయటకు వచ్చిన రాజసింహన్….తన పై తప్పుడు కేసు పెట్టిన ఉమారాణి, జ్ఞాన సెల్వం వారికి సహకరించిన మరో మహిళా ఎస్సై పైనా, విష్ణుప్రియ అనే మహిళ పైనా కేసు పెట్టాడు. తన క్రెడిట్ కార్డు ఉపయోగించుకుని ఎస్సై జ్ఞాన సెల్వం విదేశాలకు వెళ్లి వచ్చిన విమాన టికెట్లను సాక్ష్యంగా పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న థౌజండ్ లైట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.