జాగ్రత్త.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కొనండి.. డేట్ మార్చి హల్దీరామ్ ఫుడ్స్ అమ్మకాలు..

మీరు మార్కెట్ లో ఏదైనా ఫుడ్ ప్యాకెట్ కొనుక్కుని తింటున్నారా? అయితే జాగ్రత్త.. ఒకటికి రెండు సార్లు ఆ ప్యాక్ పై ఉన్న ఎక్స్ పైరీ డేట్ ని నిశితంగా గమనించండి. డేట్ లో ఏదైనా మార్పు ఉందేమో చూడండి. దాన్ని గోకినట్టు కానీ, దాని మీద మరో డేట్ రాసినట్టు కానీ ఏ మాత్రం అనుమానం వచ్చినా

జాగ్రత్త.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కొనండి.. డేట్ మార్చి హల్దీరామ్ ఫుడ్స్ అమ్మకాలు..

Expiry Date Change

Expiry Date Change : మీరు మార్కెట్ లో ఏదైనా ఫుడ్ ప్యాకెట్ కొనుక్కుని తింటున్నారా? అయితే జాగ్రత్త.. ఒకటికి రెండు సార్లు ఆ ప్యాక్ పై ఉన్న ఎక్స్ పైరీ డేట్ ని నిశితంగా గమనించండి. డేట్ లో ఏదైనా మార్పు ఉందేమో చూడండి. దాన్ని గోకినట్టు కానీ, దాని మీద మరో డేట్ రాసినట్టు కానీ ఏ మాత్రం అనుమానం వచ్చినా వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. లేదంటో ఆరోగ్యంతో చెలగాటం ఆడినట్టే.

హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. హల్దీ రామ్ పేరుతో కాలం చెల్లిన వాటిని… తేదీలు మార్చి విక్రయాలు జరుపుతున్న డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీ నారాయణను లంగర్ హౌస్ పోలీసులు సోమవారం(ఏప్రిల్ 5,2021) అరెస్ట్ చేశారు. ఓ గోదాంలో నిల్వ ఉంచుతూ.. తిను బండారాల విక్రయాలు జరుపుతున్నాడు నారాయణ. అయితే, అందులో చాలా వరకు కాలం చెల్లినవి ఉన్నాయి. టిన్నర్‌తో డేట్ తొలగించి కొత్త డేట్ మార్చి.. లేటెస్ట్‌గా మార్కెట్‌లో అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. మొత్తం లక్షా 50 వేల విలువ చేసే తిను బండారాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

జైశ్రీరామ్ ఏజెన్సీ ద్వారా డేట్ అయిపోయిన వాటిని మార్కెట్‌లో అమ్ముతున్నట్టు పోలీసులు చెప్పారు. కరోనా ఎఫెక్ట్‌తో నష్టం రావడంతో ఈ విధంగా నిందితుడు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, హల్దీ రామ్ కంపెనీ‌కి కూడా ఈ విషయం తెలియదన్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏదైనా వస్తువు కొనేముందు పలుమార్లు చెక్ చేసి కొనడం మంచిదని సూచించారు.