ఆవుకు మేతలో పేలుడు పదార్థాలు పెట్టి తినిపించారు.. కేసు నమోదు

  • Published By: sreehari ,Published On : November 16, 2020 / 08:07 AM IST
ఆవుకు మేతలో పేలుడు పదార్థాలు పెట్టి తినిపించారు.. కేసు నమోదు

Cow fed explosives in Rajasthan : హృదయ విచారక ఘటన.. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఆవుకు మేతలో పేలుడు పదార్థాలను తినిపించారు. మేతలో పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలడంతో ఆవు తీవ్రంగా గాయపడింది.



గాయపడిన ఆవును చికిత్స నిమిత్తం జదాన్ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆవు వెటర్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన గ్రామంలో స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఆవు విజిలెంట్ గ్రూపులైన గౌపుత్ర సేన, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించాయి. మేతలో పేలుడు పదార్థాలు పెట్టిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



గౌపుత్ర సేన వర్కర్లు సిరియారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించామని ఇన్విస్టేషన్ అధికారి సురేష్ సరన్ తెలిపారు.
https://10tv.in/mental-relief-with-cow-hugging-become-trend-worldwide/



త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామన్నారు. గతంలో, కేరళలో గర్భం దాల్చిన ఏనుగుకు పేలుడు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తినిపించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.