WhatsApp Hacking Racket : వాట్సప్ హ్యాకింగ్ ముఠా గుట్టురట్టు

సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్‌ను హ్యాక్ చేసి వినియోగదారులనుంచి డబ్బులు దోచుకుంటున్న ముఠా గుట్టును ఢిల్లీ స్పెషల్ సైబర్ క్రైమ్ యూనిట్, స్ట్రాటజిక్ ఫ్యూజన్ మరియు స్ట్రాటజిక్ ఆప

WhatsApp Hacking Racket : వాట్సప్ హ్యాకింగ్ ముఠా గుట్టురట్టు

Whats App Hacking Racket

WhatsApp Hacking Racket :  సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్‌ను హ్యాక్ చేసి వినియోగదారులనుంచి డబ్బులు దోచుకుంటున్న ముఠా గుట్టును ఢిల్లీ స్పెషల్ సైబర్ క్రైమ్ యూనిట్, స్ట్రాటజిక్ ఫ్యూజన్ మరియు స్ట్రాటజిక్ ఆప్స్ (IFSO), అధికారులు రట్టు చేశారు.

ఢిల్లీ, బెంగుళూరు కేంద్రాలుగా పని చేస్తున్న ఈ ముఠాకు చెందిన ఇమ్మాన్యుయేల్ అలియాస్ మౌరిస్ డెగ్రిగా గుర్తించారు. ఈ ముఠా టార్గెట్ చేసిన వారి వాట్సప్ ను హ్యాక్ చేసి ఆయా వ్యక్తుల కాంటాక్ట్ నెంబర్లకు అభ్యంతరకర మెసేజ్ లను పంపుతూ డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.

ఓ బాధితుడు తన వాట్సప్ ను   హ్యాక్ చేశారని ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠా వ్య‌వ‌హారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి కి తెలిసిన వారి కాంటాక్ట్‌ నెంబర్లకు  డ‌బ్బు  ట్రాన్సఫర్  చేసేలా వారికి నిందితుడు త‌న బ్యాంక్ ఖాతా వివ‌రాల‌ను కూడా ఇచ్చాడ‌ని స్పెష‌ల్ సెల్ డీసీపీ  కేపీఎస్ మ‌ల్హోత్ర చెప్పారు.

నిందితుడి నుంచి 15 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్ ద్వారా వివిధ మాల్ వేర్ లింకులను తయారుచేసేందుకు  నిందితుడు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ప్రత్యేకంగా రూపోందించిన మాల్ వేర్ ను,  ఏదైనా అప్లికేషన్ ను బాధితుడి వాట్సప్ కు పంపేవాడు.  దానిని డౌన్లోడు చేసుకుని బాధితుడి ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే ఆ ఫోన్ లోని అన్ని కాంటాక్ట్ నెంబర్లు ఈ ముఠా చేతిలోకి  వెళ్లిపోతాయి.

Also Read : Huzurabad Bypoll Results : హుజూరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి

అప్పటినుంచి బాధితుడి బ్రౌజింగ్  ఆపరేషన్లు అన్నీ నిందితులకు తెలిసిపోతాయి. మొదట అమ్మాయిగా పరిచయం చేసుకుని పురుషులతో స్నేహం చేసి వారికి మాల్ వేర్ లింక్ పంపించి అది ఇన్ స్టాల్ అయిన తర్వాత వారి ఫోన్ ను, వాట్సప్‌ను  హ్యక్ చేసి ఈ ముఠా నేరాలకు పాల్పడుతోందని IFSO, స్పెషల్ సెల్ డీసీపీ కేపీఎస్ మల్హోత్రా చెప్పారు.

నిందితుడు ఇమ్మాన్యుయేల్ వీసా గడువు ముగిసినా ఇంకా భారత దేశంలో ఉన్నాడని … అతని టూరిస్ట్ వీసా 2018 లోనే ముగిసిందని ఆయన తెలిపారు. అరెస్టైన నిందితుడికి ఇల్లు అద్దెకు ఇచ్చిన ఇంటి యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 188, 14సీ ఫారినర్ యాక్ట్ కింద ప్రత్యేక కేసునమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.