బతికుండగానే : దిశ కేసులో వెలుగులోకి మరో దారుణ నిజం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో దారుణమైన మరో నిజం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తర్వాత దిశను తగలబెట్టారని ఇప్పటివరకు

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 10:08 AM IST
బతికుండగానే : దిశ కేసులో వెలుగులోకి మరో దారుణ నిజం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో దారుణమైన మరో నిజం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తర్వాత దిశను తగలబెట్టారని ఇప్పటివరకు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో దారుణమైన మరో నిజం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తర్వాత దిశను తగలబెట్టారని ఇప్పటివరకు అంతా అనుకున్నారు. కానీ.. బతికుండగానే దిశను తగలబెట్టారు అనే నిజం వెలుగులోకి వచ్చింది. దిశ నిందితుల్లో ఒకడు జైలు కాపలాదారుడితో ఈ నిజాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. కొందరు కాపలాదారులు నిందితులతో మాట కలిపారు. ప్రధాన నిందితుడు ఆరిఫ్.. ఏ మాత్రం భయం లేకుండా తాము చేసిన దుర్మార్గాన్ని పూస గుచ్చినట్టు వారికి చెప్పాడట. 

బలవంతంగా కాళ్లు, చేతులు పట్టుకుని దిశను లాక్కెళ్లామని, ఆమె పెద్దగా కేకలు వేస్తుంటే, ఎవరైనా వింటారన్న భయంతో తమ దగ్గరున్న మద్యాన్ని బలవంతంగా నోట్లో పోశామని, అప్పటికే తీవ్ర భయంతో ఉన్న ఆమె స్పృహ తప్పగా అత్యాచారం చేశామని ఆరిఫ్ చెప్పినట్టు జైలు సిబ్బందిలో ఒకరు వెల్లడించారు. మద్యం తాగించడంతో పాటు అత్యంత క్రూరంగా ప్రవర్తించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టామని చెప్పాడట.

ప్రస్తుతం దిశ హత్యాచారం కేసు నిందితులు నలుగురు చర్లపల్లి జైల్లో ప్రత్యేక నిఘాలో ఉన్నారు. కొందరు సిబ్బందిని వీరికి కాపలాగా ఉంచారు. సిబ్బంది వారితో మాట కలిపినప్పుడు ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయాలను ఈ నలుగురు బయటపెట్టినట్టు తెలుస్తోంది.

దిశ హత్యాచారం కేసుని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కోసం చర్యలు చేపట్టింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకి లేఖ రాసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరగా పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కోరింది. ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు కోసం ప్రభుత్వం తరఫున న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి హైకోర్టుకి లేఖ రాశారు. సాయంత్రంలోగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుపై హైకోర్టు నిర్ణయం తెలపనుందని సమాచారం.

Read More : నిర్భయ నుంచి దిశ వరకు..! ఏడేళ్లలో మనం ఎంతవరకు మారాం?