Kothagudem News: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య: ముగ్గురు మృతి, ఒకరి పరిస్థితి విషమం

అధిక రాబడి ఆశించి.. ఆన్ లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టిన వ్యక్తి..ఆశించిన ఫలితంరాక.. అప్పులపాలై చివరకు బలవన్మరణానానికి పాల్పడ్డారు

Kothagudem News: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య: ముగ్గురు మృతి, ఒకరి పరిస్థితి విషమం

Family

Kothagudem News: అప్పుల బాధలు ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. అధిక రాబడి ఆశించి.. ఆన్ లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టిన వ్యక్తి..ఆశించిన ఫలితంరాక.. అప్పులపాలై చివరకు బలవన్మరణానానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. పాల్వంచ మండలం పాతపాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక పెట్రోల్ పోసుకుని కుటుంబంతో సహా ఆత్మహత్యకుపాల్పడ్డారు. స్థానికంగా మీసేవా నిర్వహిస్తున్న నాగ రామకృష్ణకు… భార్య శ్రీలక్ష్మి, 14 సంవత్సరాల వయసున్న సాహితి సాహిత్య అనే కవల పిల్లలు ఉన్నారు. అధిక డబ్బు సంపాదించేందుకు ఆన్ లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టాడు నాగ రామకృష్ణ. యాప్ లో పెట్టుబడి పెట్టేందుకు కొంత మేర అప్పులు చేశాడు.

Also Read: Corona in Cruise: క్రూయిజ్ షిప్ లో ఒకరికి కరోనా పాజిటివ్, ఓడ నిలిపివేత

అయితే పెట్టిన పెట్టుబడికి రాబడి రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చేందుకు.. ఇల్లు, కారు తాకట్టు పెట్టాడు. అయినా అప్పులు తీరక, స్నేహితుల వద్దకు వెళ్ళాడు. వారి నుండి నిరాశ ఎదురవడంతో.. దిక్కుకుతోచని స్థితిలో భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఈక్రమంలో కుటుంబమంతా గదిలోకి వెళ్లి.. పెట్రోల్ పోసుకుని ఆపై గ్యాస్ లీక్ చేసి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈఘటనలో నాగ రామకృష్ణ అతని భార్య శ్రీలక్ష్మి, కూతురు సాహితీ అక్కడిక్కడే మృతి చెందగా..సాహిత్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన అనంతరం ఇరుగుపొరుగువారు స్పందించి తీవ్రంగా గాయపడిన సాహిత్యను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Man shot dead: ఫుడ్ సర్వ్ చేయలేదని హోటల్ యజమానిని కాల్చిచంపిన వైనం