Hyderabad Couple Cheating : వామ్మో.. ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో ఘరానా మోసం, కోట్లు కొట్టేసిన దంపతులు

ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో దందా చేసి కోట్లు కొట్టేశారు శ్రీధర్ రెడ్డి, సంధ్యా రెడ్డి దంపతులు. ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామని.. తమకు సీఎంవోలో, క్యాంప్ ఆఫీస్ లో తెలిసిన వారున్నారని.. సీటు గ్యారంటీ అని నమ్మించి కోట్లు వసూలు చేశారు.

Hyderabad Couple Cheating : వామ్మో.. ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో ఘరానా మోసం, కోట్లు కొట్టేసిన దంపతులు

Hyderabad Couple Cheating : హైదరాబాద్ లో ఘరానా మోసం బయటపడింది. భార్య, భర్త కలిసి చేసిన ఫ్రాడ్ బట్టబయలైంది. మాయ మాటలతో ఆ దంపతులు కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. నమ్మించి నట్టేట ముంచారు. అందినకాడికి దోచేశారు.

Also Read..Tollywood : అనుష్క, మణిశర్మ పేరు చెప్పి రూ.66 లక్షలు మోసం..

వివరాల్లోకి వెళితే.. ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో దందా చేసి కోట్లు కొట్టేశారు శ్రీధర్ రెడ్డి, సంధ్యా రెడ్డి దంపతులు. ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామని.. తమకు సీఎంవోలో, క్యాంప్ ఆఫీస్ లో తెలిసిన వారున్నారని.. సీటు గ్యారంటీ అని నమ్మించి కోట్లు వసూలు చేశారు.

Also Read..Umesh Yadav Cheated : భారత క్రికెటర్‌ను దారుణంగా మోసం చేసిన స్నేహితుడు.. రూ.44 లక్షలకు టోకరా

మెడికల్ సీటుకి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు.. ఇంజినీరింగ్ సీటుకి రూ.10లక్షల నుంచి 16 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. గ్రోవెల్ ఎడ్యుకేషన్ కెరియర్ సర్వీసెస్ పేరుతో కాచిగూడలో సంస్థలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. మోసాలకు పాల్పడుతున్న దంపతులపై పోలీసులను ఆశ్రయించారు బాధితులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రముఖ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తాని దంపతులు చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు విచారణలో వెలుగుచూసింది. దంపతులు గత కొన్నేళ్లుగా ఈ దందాకు పాల్పడుతున్నట్లు తెలిసింది. సీట్ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారు. అయితే అడిగినంత డబ్బు ఇచ్చినా సీటు రాకపోయేసరికి తమ మోసపోయామని తెలిసి బాధితులు లబోదిబోమన్నారు. దంపతులు అనేక మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

సీఎం క్యాంప్ ఆఫీస్ లో తమకు పరిచయాలు ఉన్నాయని చెబుతూ దంపతులు మోసానికి పాల్పడ్డారు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని దంపతులను డిమాండ్ చేశారు. గత 5 నెలలుగా డబ్బు కోసం తిరుగుతున్నారు. అయితే దంపతులు అందుబాటులో లేకపోవడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు.

వారి ఫిర్యాదుల మీద పోలీసులు స్పందించ లేదు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. కాచిగూడలోని గ్రోవెల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ముందు ఆందోళన చేపట్టారు. మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు వస్తాయని నమ్మి లక్షల రూపాయలు వారికి ముట్టజెప్పామని, చివరికి తమను మోసం చేసి పారిపోయారని బాధితులు వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు బాధితులు.