Drug Chocolate Bars : కాలేజీకి వెళ్లే మీ పిల్లలు ఖరీదైన ఆ చాక్లెట్ తింటున్నారా? పేరెంట్స్ బీకేర్ ఫుల్.. హైదరాబాద్‌లో డ్రగ్ చాక్లెట్స్ కలకలం

కాలేజీకి వెళ్లే మీ పిల్లలు చాక్లెట్ తింటున్నారా? చాక్లెటే కదా అని లైట్ తీసుకోవద్దు. ఆ చాక్లెట్ తింటే ఇక అంతే. ఏం చేస్తున్నామో తెలీదు, ఎక్కడ ఉన్నామో తెలీదు. మత్తులో తేలిపోతారు.

Drug Chocolate Bars : కాలేజీకి వెళ్లే మీ పిల్లలు ఖరీదైన ఆ చాక్లెట్ తింటున్నారా? పేరెంట్స్ బీకేర్ ఫుల్.. హైదరాబాద్‌లో డ్రగ్ చాక్లెట్స్ కలకలం

Drug Chocolate Bars : కాలేజీకి వెళ్లే మీ పిల్లలు చాక్లెట్ తింటున్నారా? చాక్లెటే కదా అని లైట్ తీసుకోవద్దు. ఆ చాక్లెట్ తింటే ఇక అంతే. ఏం చేస్తున్నామో తెలీదు, ఎక్కడ ఉన్నామో తెలీదు. మత్తులో తేలిపోతారు. కెరీర్ ఆగమాగం కావొచ్చు. ఎందుకంటే, అవి మామూలు చాక్లెట్స్ కాకపోవచ్చు. గమ్మత్తు చాక్లెట్స్. హైదరాబాద్ లో చాక్లెట్ డ్రగ్స్ కలకలం రేపాయి. హైదరాబాద్ లో జోరుగా అమ్ముడవుతున్న ఈ మత్తు చాక్లెట్లు యూత్ టార్గెట్ చేసి తయారు చేసి అమ్ముతున్న ఓ యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒక్క చాక్లెట్.. 8 గంటల మైకం.. డ్రగ్స్ దందాలో నయా రూట్.. ఎవరికీ డౌట్ రాదు.. తింటే మత్తు వదలదు. చాక్లెట్ లో హాష్ ఆయిల్ మిక్సింగ్. ఎంత తింటే అంత మత్తు. ఇవి అలాంటి ఇలాంటి చాక్లెట్లు కాదు. హాష్ ఆయిల్ మిక్స్ చేసిన మత్తు ఇచ్చే చాక్లెట్లు. చాక్లెట్స్ మాటున డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసింది హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ వింగ్ పోలీసులు. ఆ యువకుడు డ్రగ్స్ తయారు చేసే విధానం, విక్రయించిన తీరు తెలుసుకుని షాక్ తిన్నారు పోలీసులు.

హైదరాబాద్ లో డ్రగ్స్ దందా 3 గ్రాములు 6 వేలు అన్నట్లుగా సాగుతోంది. గోవా నుంచి వచ్చేవే కాకుండా విశాఖ ఏజెన్సీ నుంచి వచ్చే గంజాయి అడిషనల్. పౌడర్ రూపంలోనే కాక హాష్ ఆయిల్ గాను గంజాయి దందా జోరుగా సాగుతోంది. అయితే, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పోలీసులు పట్టుకుంటుండటంతో రూటు మార్చారు డ్రగ్స్ పెడ్లర్స్.

ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు హష్ ఆయిల్ తోనే చాక్లెట్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు నార్సింగికి చెందిన రిషీ సంజయ్. ఈ కుర్రాడి వయసు జస్ట్ 22ఏళ్లు. ఈ వయసులోనే ఎంత కన్నింగ్ తెలివితేటలో చూడండి. మత్తు చాక్లెట్స్ ను స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టార్గెట్ చేసి ఎడాపెడా అమ్మేస్తున్నాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మత్తు చాక్లెట్లు తయారు చేస్తున్నాడని.. రిషీ ఏదో జులాయి అనుకోవద్దు. యూనివర్సిటీ ఆఫ్ ఫినిక్స్ లో ఆన్ లైన్ బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్నాడు. పేరెంట్స్ కు తెలియకుండా ఈ దందా చేస్తున్నాడు. గంజాయి, హాష్ ఆయిల్ కు బానిసైన రిషీ.. మొదట్లో డబ్బుల కోసం ఈ-సిగరెట్లు, డ్రగ్స్ అమ్మేవాడు. అయితే పెద్దగా గిట్టుబాబు కాకపోవడంతో యూట్యూబ్ లో చూసి హాష్ ఆయిల్ చాక్లెట్ల తయారీ మొదలుపెట్టాడు. డైరెక్ట్ గా విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి ఫారెస్ట్ ఏరియా నుంచి హాష్ ఆయిల్ తెప్పించుకున్నాడు. ఆల్రెడీ మార్కెట్ లో ఫేమస్ బ్రాండ్ చాక్లెట్స్ తీసుకుని వాటికి హాష్ ఆయిల్ పట్టించేవాడు. 4 కిలోల చాక్లెట్లకు 40గ్రాముల హాష్ ఆయిల్ ను మిక్స్ చేసేవాడు. వాటిలో ఓరియో, కిట్ కాట్, క్యాడ్ బరీ ఫ్లేవర్లతో డ్రగ్ చాక్లెట్ బార్లను తయారు చేసేవాడు.

ఒక్కో బార్ ను రూ.5వేల నుంచి రూ.10వేలకు అమ్మేవాడు. ఒక్కో బార్ లో 15 ముక్కలు ఉండటంతో ఒక్కో ముక్కను రూ. వెయ్యి నుంచి రూ.2లకు అమ్మేవాడు. రిషీ తయారు చేసే చాక్లెట్ స్మెల్ పీల్చినా కూడా మత్తు ఎక్కుతుందని అంటున్నారు పోలీసులు. ఒక్క చాక్లెట్ పీస్ తిన్న వాళ్లు 8 గంటల పాటు కిక్ లో మునిగితేలుతారు.

హైదరాబాద్ లో రిషీకి వందమందికి పైగా కస్టమర్లు ఉన్నారు. వీరిలో సగానికి పైగా మంది అమ్మాయిలే ఉండటం చూసి పోలీసులే షాక్ అయ్యారు. బిజినెస్ కోసం సోషల్ ప్లాట్ ఫామ్స్ వినియోగించుకునే వాడు రిషీ సంజయ్. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్ చాట్ లో పోస్టులు పెట్టేవాడు. ఎడిబుల్స్ అవైలబుల్ అన్న కోడ్ తో మేసేజ్ లు పెట్టేవాడు. ఎన్ క్రిప్టడ్ మేసేజ్ కావడంతో స్నాప్ చాట్ లో పెట్టిన 25 సెకన్లలో డిలీట్ అయిపోతుంది. కావాల్సిన వాళ్లు కాంటాక్ట్ చేయగానే.. ఉబర్, రాపిడో బైక్ ల ద్వారా చాక్లెట్లను పంపించే వాడు.

ఈ దందాపై చాలా రోజులుగా నిఘా పెట్టిన పోలీసులు చివరికి రిషీ అని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.5లక్షల విలువైన 48 డ్రగ్స్ చాక్లెట్లు, 40 గ్రాముల హష్ ఆయిల్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.