Jammu Fast Track Court : మహిళపై అత్యాచారం చేసిన కేసులో సబ్ జడ్జిని దోషిగా తేల్చిన కోర్ట్

న్యాయ సహాయం కోసం వచ్చిన మహిళపై అత్యాచారం చేసి మోసగించిన కేసులో సబ్ జడ్జిని జమ్మూలోని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ నిన్న దోషిగా తేల్చింది. ఇందుకు సంబంధించి శిక్షను రేపు ఖరారు చేయనున్నారు.

Jammu Fast Track Court : మహిళపై అత్యాచారం చేసిన కేసులో సబ్ జడ్జిని దోషిగా తేల్చిన కోర్ట్

Rape And Cheating

Jammu Fast Track Court :  న్యాయ సహాయం కోసం వచ్చిన మహిళపై అత్యాచారం చేసి మోసగించిన కేసులో సబ్ జడ్జిని జమ్మూలోని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ గురువారం  దోషిగా తేల్చింది.  ఇందుకు సంబంధించి శిక్షను రేపు ఖరారు చేయనున్నారు.

2018 వ  సంవత్సరంలో  ఒక మహిళ న్యాయ సహాయం కోరుతూ అప్పటి  అప్పటి సబ్ జడ్జి  రాకేశ్ కుమార్ అబ్రోల్ ను సంప్రదించింది.  ఆమెకు సహాయం చేస్తానని చెప్పి, ఆ మహిళను తన ఇంటి పనిమనిషిగా నియమించుకుని నెలకు రూ. 5వేలు జీతం ఇవ్వసాగాడు. ఆమె కుమార్తెకు చదువు చెప్పిస్తానని చెప్పి స్కూల్ లో చేర్పించాడు. అప్పటికే ఏడేళ్లుగా భార్య నుంచి వేరు పడిన రాకేశ్ కుమార్ ఒంటరిగా జీవిస్తున్నాడు.

Also Read : Pattabhi Case : రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి తరలింపు

కాగా…. మహిళ కుటుంబీకులు  మహిళను అక్కడ  పనిమానేసి ఇంటికి తిరిగిరావాలని కోరారు.  ఆమహిళ  ఇంటికి వెళ్లిపోవటానికి సిధ్ధపడగా….  తన  భార్య నుంచి విడాకులు వచ్చిన తర్వాత  పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి వెళ్ళకుండా చేశాడు.  పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పటి నుంచి  ఆమహిళతో శారీరకంగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో మొదటి భార్యనుంచి విడాకులు పొందిన తర్వాత రాకేష్ కుమార్ వేరొక మహిళను పెళ్లి చేసుకున్నాడు.

దీంతో  ఇంట్లో పని చేస్తున్న మహిళ మోసపోయానని గ్రహించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు  చేపట్టి  రాకేశ్ కుమార్ పై  నేరం రుజువు చేశారు.  దీంతో రాకేశ్ కుమార్‌ను జమ్ములోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది.  ఈ కేసులో శనివారం శిక్షను ఖరారు చేయనుంది.