Extra Marital Affair : 50 ఏళ్ల వయస్సులో వివాహేతర సంబంధం- భార్యను హత్య చేసిన భర్త

పెళ్లై పాతికేళ్లు దాటి పిల్లల పెళ్ళిళ్లు కూడా చేశాక ఒక ఇల్లాలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది.

Extra Marital Affair : 50 ఏళ్ల వయస్సులో వివాహేతర సంబంధం- భార్యను హత్య చేసిన భర్త

Illeagal Affair

Extra Marital Affair : వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్నాయి. వాటికి ప్రాంతాలతో నిమిత్తం లేదు. ఆవేశంలో చేసే పనులతో జీవితాలు జైలు పాలవుతున్నాయి. పెళ్లై పాతికేళ్లు దాటి పిల్లల పెళ్ళిళ్లు కూడా చేశాక ఒక ఇల్లాలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది.

జమ్మూ కాశ్మీర్ లోని   శ్రీనగర్  జకురా ప్రాంతం గులాబ్ బాగ్ ఏరియాలోని గులిస్తాన్ కాలనీలో అబ్దుల్ రెహ్మాన్ దార్, సలీమా(50) దంపతులు నివాసం ఉంటున్నారు. రెహమాన్ కాశ్మీర్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో పని చేస్తున్నాడు. వీరికి 25 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వారి పిల్లలకు కూడా పెళ్లిళ్లై హాయిగా సంసారం చేసుకుంటున్నారు.

ఈక్రమంలో సలీమా వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం పసిగట్టిన రెహ్మాన్ సలీమాను హెచ్చరించాడు. ఈ వయస్సులో ఇలాంటి పనులు వద్దని వారించాడు. ఈక్రమంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కొందరు పెద్దలు గొడవ పడవద్దని వారిద్దరికీ నచ్చచెప్పారు. అయినా భార్య సలీమా తన పద్ధతి మార్చుకోలేదు.
Also Read : TV Actress Soujanya : యువనటి సౌజన్య ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
దీంతో కోపోద్రిక్తుడైన రెహమాన్ సెప్టెంబర్ 30 గురువారం నాడు భార్యను కిరాతకంగా హత్యచేసి తన ఉద్యోగానికి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సలీమాను చూసిన పక్కింటి వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త రెహమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన భార్యను హత్య చేశారని చెప్పి తప్పించు కోవాలను కున్నాడు. కానీ… పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించే సరికి నేరం ఒప్పుకున్నాడు. ఈ వయస్సులో తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కోపంతో హత్య చేసినట్లు తెలిపాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జకురా పోలీసు స్టేషన్ ఎస్ఐ తెలిపారు.