Fastag : పారిపోయిన ఖైదీని పట్టిచ్చిన ఫాస్టాగ్ | Fastag

Fastag : పారిపోయిన ఖైదీని పట్టిచ్చిన ఫాస్టాగ్

పోలీసుల కళ్లు గప్పి కోర్టు ప్రాంగంణం నుంచి పరారైన ఖైదీని  ఫాస్టాగ్ సాయంతో   పోలీసులు పట్టుకున్న  ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

Fastag : పారిపోయిన ఖైదీని పట్టిచ్చిన ఫాస్టాగ్

Fastag :  పోలీసుల కళ్లు గప్పి కోర్టు ప్రాంగంణం నుంచి పరారైన ఖైదీని  ఫాస్టాగ్ సాయంతో   పోలీసులు పట్టుకున్న  ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని  కృష్ణాజిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన ఐతం రవిశంకర్(46) 2019 నుంచి చర్లపల్లి జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఇతనిపై చీటింగ్,కిడ్నాప్ కేసులు ఉన్నాయి.

2019లో  నల్గోండ జిల్లా వాడపల్లి పోలీసు స్టేషన్ లో తనపై   నమోదైన చీటింగ్ కేసు విచారణకు మే 5న కోర్టుకు హాజరవ్వాలని తెలుసుకున్నాడు. ఆ సమయంలో కోర్టు నుంచి తప్పించుకు పారిపోవాలని ప్లాన్ వేశాడు. శ్రీధర్ అనే తోటి ఖైదీతో స్నేహం చేసి అతని కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకున్నాడు.

తనకు తెలిసిన న్యాయవాదితో మాట్లాడి శ్రీధర్ కు బెయిల్ వచ్చేలా చేస్తానని నమ్మించాడు. వారిని మే5 గురువారం మిర్యాలగూడ కోర్టుకు రమ్మని చెప్పాడు. పోలీసులు  ఈనెల 5వ తేదీన చర్లపల్లి  జైలు నుంచి రవిశంకర్ ను చీటింగ్ కేసు విచారణ నిమిత్తం బస్సులో మిర్యాలగూడ కోర్టుకు తీసుకువచ్చి హజరు పరిచారు. అప్పటికి సాయంత్రం అయ్యింది.

అనంతరం అక్కడే ఉన్న తన బంధువులతో మాట్లాడతానని చెప్పి శ్రీధర్ బంధువుల దగ్గరకు వెళ్లి మాట్లాడసాగాడు. అదును చూసి ఎస్కార్ట్ పోలీసులు కళ్లుగప్పి, శ్రీధర్ బంధువులు వచ్చిన కారులో(టీఎస్08జీఎల్8818) పరారయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు స్ధానిక పోలీసులకు సమాచారం అందించారు. మిర్యాలగూడ  డీఎస్పీ వెంకటేశ్వరరావు  తన సిబ్బందితో రంగంలోకి దిగారు. నల్గొండ కంట్రోల్ రూమ్ నుంచి కారు కదలికలను గమనించసాగారు.

కారులో ఉన్న డ్రైవర్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కారు గురజాల వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. గురజాల చేరాక   ఫోన్ స్విఛ్చాఫ్ రావటంతో కారు నెంబరు దానిపై ఉన్నఫాస్టాగ్ ఆధారంగా గాలింపు  చేపట్టారు. పోలీసులను టోల్ గేట్లు వద్ద చెకింగ్ చేసేలాగా ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లాలోని అన్ని టోల్ గేట్లకు ఫాస్టాగ్ నెంబరును, కారు నెంబరును పంపించారు.
Also Read : Minister KTR : సీఎం పోస్ట్ @ రూ.2500 కోట్లు-నడ్డాను ప్రశ్నించిన కేటీఆర్
శుక్రవారం తెల్లవారు ఝామున టంగుటూరు టోల్ ప్లాజా వద్ద  రవిశంకర్ ప్రయాణిస్తున్న కారు   ఫాస్టాగ్ బిల్లు కట్ అయినట్లు తెలుసుకుని అక్కడ ఉన్న పోలీసులను అలర్ట్ చేశారు. వెంటనే వారు కారును 7 కిలోమీటర్లు వెంబడించి రవిశంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా పోలీసులు అతడిని శుక్రవారం ఉదయం కోర్టులో హాజరు పరిచారు.

×