Major Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం-9 మంది మృతి

హర్యానాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9మంది మరణించారు.

Major Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం-9 మంది మృతి

Haryana Road Accident

Updated On : October 22, 2021 / 1:18 PM IST

Major Road Accident :  హర్యానాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9మంది మరణించారు. హర్యానా లోని జఝ్జర్ జిల్లాలోని బద్ది ప్రాంతంలో కేఎంపీ( కుండ్లి-మనేసర్-పాల్వాల్) ఎక్స్ ప్రెస్ వే పై అగి ఉన్న లారీని కారు ఢీ కొట్టటంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఒక చిన్నారి ఉన్నారు. గాయపడిన వారిని, మరణించిన వారి మృతదేహాలను సమీపంలోని బహుదూర్ ఘర్ ఆస్పత్రికి తరలించారు.

Haryana Road Accident

Haryana Road Accident

రాజస్ధాన్ నుండి 11 మందితో ఉత్తరప్రదేశ్ వెళ్తున్న ఎర్టిగా కారు జాతీయ రహదారిపై, బద్లి- ఫరూఖ్ నగర్ మధ్య ఆగిఉన్న లారీని ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది.ఇదే కారు వెనుక ఏడుగురు ప్రయాణికులతో వస్తున్న ఎకో కారు ప్రమాదం జరిగిన ఎర్టిగా కారు వద్ద ఆగి చూస్తుండగా. ఆకారు వెనుక వస్తున్న మరోక లారీ ఎకో కారును ఢీ కొట్టటంతో అందులోని ఒకరు మరణించారు. మరి కొందరికి గాయాలయ్యాయి.

Also Read : Extra Marital Affair : 17 ఏళ్ల బాలుడితో 28 ఏళ్ల మహిళ వివాహేతర సంబంధం