ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తా అరెస్టు

ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తాను అరెస్టు చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు సుఖేశ్ గుప్తాను అదుపులోకి తీసుకుని, నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 02:35 PM IST
ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తా అరెస్టు

ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తాను అరెస్టు చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు సుఖేశ్ గుప్తాను అదుపులోకి తీసుకుని, నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.

ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తాను అరెస్టు చేశారు. మంగళవారం (అక్టోబర్ 29, 2019) సుల్తాన్ బజార్ పోలీసులు సుఖేశ్ గుప్తాను అదుపులోకి తీసుకుని, నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం పిటి వారెంట్ ద్వారా కోల్ కతాకు తరలించనున్నారు. బుధవారం (అక్టోబర్ 30, 2019) కోల్ కతా కోర్టులో సుఖేశ్ గుప్తాను ప్రవేశపెట్టనున్నారు.

కోల్ కతాకు చెందిన బ్యాంకు నుంచి సుఖేశ్ కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. వాటి చెల్లింపుల్లో విఫలమవ్వడంతో దాంతో చెక్ బౌన్స్ కేసు నమోదు అయింది. బ్యాంకు వారంతా కోల్ కతా 11వ మెట్రో కోర్టును ఆశ్రయించారు. వెంటనే హాజరు కావాలని పలుమార్లు అతనికి నోటీసులు ఇచ్చినా.. హాజరుకాకపోవడంతో సుఖేశ్ గుప్తాను వెంటనే అరెస్టు చేయాలని సుల్తాన్ బజార్ పోలీసులకు స్పీడ్ పోస్టు చేసింది కోల్ కతా కోర్టు. చెక్ బౌన్స్ కేసులో కోల్ కతా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేసి, నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం పిటి వారెంట్ ద్వారా కోల్ కతాకు తరలించారు. 

2011లో ఎంఎంటీసీ సంస్థకు దాదాపు 200 కోట్ల వరకు టోకరా పెట్టారు. తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్లు ఆధారాలను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. గతంలో సీబీఐ కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలిచ్చినా హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. సీబీఐ, ఈడీ అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. 

ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు అతనిపై అనేక కేసులు నమోదు చేశారు. ఆ కేసులు కొనసాగుతున్న క్రమంలో ప్రస్తుతం కోల్ కతా బ్యాంకులకు సంబంధించిన కేసు కూడా నమోదు అయింది. కోల్ కతాలోని బ్యాంకు లావాదేవీల్లో చెక్ బౌన్స్ అయిన కేసులో సుఖేశ్ గుప్తాపై 138 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.