తల్లేనా, భర్త మీద కోపంతో ఐదుగురు పిల్లలను గంగలోకి తోసేసింది

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కర్కశంగా ప్రవర్తించింది. ఏకంగా ఐదుగురు కన్న బిడ్డలను గంగా నదిలోకి తోసేసింది.

  • Published By: veegamteam ,Published On : April 13, 2020 / 07:29 AM IST
తల్లేనా, భర్త మీద కోపంతో ఐదుగురు పిల్లలను గంగలోకి తోసేసింది

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కర్కశంగా ప్రవర్తించింది. ఏకంగా ఐదుగురు కన్న బిడ్డలను గంగా నదిలోకి తోసేసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కర్కశంగా ప్రవర్తించింది. ఏకంగా ఐదుగురు కన్న బిడ్డలను గంగా నదిలోకి తోసేసింది. దీనికి కారణం భర్తతో గొడవే. భర్తతో గొడవ పడిన ఆమె కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. భర్త మీద కోపం అభంశుభం ఎరుగని పిల్లల మీద చూపింది. ఐదుగురు పిల్లలను నదిలో పడేసింది. పిల్లలు కొట్టుకుపోతుంటే అక్కడే ఉండి కదలకుండా చూస్తూ నిల్చుంది. అది చూసిన స్థానికులు భయాందోళన చెందారు. ఆమె మంత్రగత్తె అనుకుని అక్కడి నుంచి పారిపోయారు.

యూపీలోని బదోహి ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు మృదుల్ యాదవ్, మంజు యాదవ్. ఏడాదిగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిత్యం గొడవలు జరుగుతుండడంతో భార్య మంజు యాదవ్ అమానుషానికి ఒడిగట్టింది. కన్నబిడ్డలను చంపేయాలని నిర్ణయించుకుంది. గంగలో తోసేసి పిల్లలను అంతమొందించాలని నిర్ణయించుకుని నది ఒడ్డుకు చేరుకుంది.

జహంగీరాబాద్ దగ్గర గంగా నది ఘాట్‌కి చేరుకున్న మంజు యాదవ్.. కన్న మమకారం కూడా లేకుండా తన ఐదుగురు బిడ్డలు ఆర్తి, సరస్వతి, మాతేశ్వరి, శివ్‌శంకర్, కేశవ్ ప్రసాద్‌లను గంగలోకి తోసేసింది. ఐదుగురు చిన్నారులు నీళ్లలో మునిగిపోతూ కేకలు పెడుతున్నా ఏమాత్రం కనికరం లేకుండా అక్కడే నిల్చుని చూస్తుండిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీళ్లలో గల్లంతైన చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కాగా, లాక్ డౌన్ వేళ ఆహారం దొరక్కపోవడంతో ఓ తల్లి తన ఐదుగురు పిల్లలను గంగలోకి తోసేసింది అనే వార్త వెలుగులోకి వచ్చింది. దీంతో అంతా జాలి చూపారు. అయ్యో పాపం అన్నారు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఆహారం దొరక్క కాదు భర్తతో గొడవలే ఆమె ఇలా చేయడానికి కారణం అని పోలీసులు తెలిపారు. ఆహారం దొరక్క తన పిల్లలను తల్లి నదిలోకి తోసిందన్న వార్త అవాస్తవం అని పోలీసులు స్పష్టం చేశారు. భర్త మీద కోపంతో ఆ కసాయి తల్లి చేసిన పనిపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. ఆ కసాయి తల్లిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Also Read | అత్తారింటికి పెగ్గుదాత, లాక్‌డౌన్ వేళ మందుబాబుల మందుదాహం తీర్చిన వ్యక్తి అరెస్ట్