Honey Trap : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై హనీట్రాప్.. పోలీసులకు ఫిర్యాదుతో ముఠాలో ఒకరి అరెస్ట్

ప్రముఖ వ్యక్తులపై  హానీ ట్రాప్ కు... పాల్పడి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా 22 మందిని హానీ ట్రాప్ చేసినట్లు గుర్తించారు.

Honey Trap : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై హనీట్రాప్.. పోలీసులకు ఫిర్యాదుతో ముఠాలో ఒకరి అరెస్ట్

Honey Trap

Honey Trap  : ప్రముఖ వ్యక్తులపై  హనీ ట్రాప్ కు… పాల్పడి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా 22 మందిని హనీ ట్రాప్ చేసినట్లు గుర్తించారు.

మధ్యప్రదేశ్ కు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వీరి గుట్టు రట్టుచేశారు. మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లా కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను హనీ ట్రాప్ చేసిందీ ముఠా. ఒకసారి న్యూడ్ వీడియో కాల్ చేసి అది చూపించి ఎమ్మెల్యే వద్దనుంచి డబ్బులు దోచుకోవాలని ప్రయత్నించారు ముఠా సభ్యులు. ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన ఛత్తర్ పూర్  సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్ లైన్ ముఠా గుట్టు రట్టుచేశారు.

రాజస్ధాన్ లోని భరత్ పూర్ జిల్లా నుంచి ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా బ్లాక్ మెయిల్ చేసిన వారిలో పంజాబ్, మహారాష్ట్ర, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, హర్యానా, మధ్య ప్రదేశ్ కు చెందిన 21 మంది ప్రముఖుల పేర్లు చూసి పోలీసులు విస్తుపోయారు.  వీరు  ఒక్కోక్కరి  వద్ద  50 వేల రూపాయల నుంచి 2 లక్షల   రూపాయల వరకు వసూలు చేసారు. వీరిలో ఏ ఒక్కరూ  పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటంతో వీరి ఆగడాలకు అంతులేకుండా పోయింది.

ఛత్తర్ పూర్ జిల్లా, మహారాజ్ పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్ కనుక ఫిర్యాదు  ఇవ్వకుండా ఉండి ఉంటే వీరు ఇంకెంతమందిని మోసం చేసేవారో అని పోలీసు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా వెబ్ సైట్ల ద్వారా ప్రముఖుల వ్యక్తిగత  సమాచారం సేకరించిన తర్వాత, ఈముఠా సభ్యులు   అందమైన యువతుల ఫోటోలతో  వారికి  ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి వారితో స్నేహం చేస్తారు.

అనంతరం వారితో చాటింగ్ చేస్తూ … వారి ఫోన్ నెంబరు తీసుకుని వారికి వాట్సప్ కాల్ చేస్తూ వారిని మాటలతో మైమరిపిస్తారు. ఈ క్రమంలో వాట్సప్ వీడియోకాల్ చేసి వారికి తెలియకుండా రికార్డు చేస్తారు. తర్వాత క్రమంలో వారికి న్యూడ్ కాల్ చేసి రెచ్చగొడతారు.  వాటిని స్క్రీన్ రికార్డ్ చేస్తారు.  తర్వాత ఆ వీడియోకాల్స్ పంపించి బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభిస్తారు.

నిందితులు అడిగినంత డబ్బులు ఇవ్వక పోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించటం మొదలెడతారు. బాధితులు డబ్బులు చెల్లించినప్పటికీ, వారిని  డబ్బుల కోసం తరచూ బెదిరిస్తూనే ఉంటున్నారు. వారితో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను, వీడియోలను సోషల్   మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూనే ఉన్నారు.

ఇప్పటికి ఈ ముఠా కొందరి వద్దనుంచి రూ. 14 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుసుకున్నారు. మహారాజ్ పూర్ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్ ను హానీ ట్రాప్ చేసిన ముఠా డబ్బుల కోసం డిమాండ్ చేయటం మొదలెట్టింది. తన అభ్యంతరకరమైన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని గుర్తు తెలియని మహిళ బెదిరిస్తోందని ఆయన మే 22న గుడిమల్ హేరా పోలీసులకు ఫిర్యాదు చేసారు.

వారు కేసును సైబర్ క్రైమ్ పోలీసులు బదిలీ చేయగా… విచారణ చేపట్టిన పోలీసులు ముఠాలోని ఒక సభ్యుడిని రాజస్ధాన్ లోని భరత్ పూర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ముఠాలోని  మిగతా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కేసు విచారణ జరుగుతోంది.