దొరికాడు : ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి అరెస్ట్

ముంబై పేలుళ్ల సూత్రధారి జీలీస్ అన్సారీ దొరికాడు. జలీల్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లోని ఓ మసీదు నుంచి బయటకు వస్తుండగా అన్సారీని

  • Published By: veegamteam ,Published On : January 17, 2020 / 03:11 PM IST
దొరికాడు : ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి అరెస్ట్

ముంబై పేలుళ్ల సూత్రధారి జీలీస్ అన్సారీ దొరికాడు. జలీల్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లోని ఓ మసీదు నుంచి బయటకు వస్తుండగా అన్సారీని

ముంబై పేలుళ్ల సూత్రధారి జలీస్ అన్సారీ దొరికాడు. జలీస్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లోని ఓ మసీదు నుంచి బయటకు వస్తుండగా అన్సారీని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అన్సారీని లక్నో తరలించారు. అన్సారీ అదృశ్యంతో పోలీసులు ఆందోళన చెందారు. ఎక్కడికి వెళ్లాడో తెలియక టెన్షన్ పడ్డారు. అతడి కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి.. అన్సారీ దొరకడంతో పోలీసలు ఊపిరి పీల్చుకున్నారు.

అనూహ్యంగా అదృశ్యం:
1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన 68 ఏళ్ల జలీస్ అన్సారీ అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. పెరోల్ పై ఉన్న అతడు గురువారం(జనవరి-16,2020)ఉదయం నుంచి కన్పించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు. లైఫ్ టర్మ్ శిక్ష అనుభవిస్తున్న జలీస్ అన్సారీ ముంబైలోని అగ్రిపాడా ఏరియాలోని మోమిన్‌ పుర నివాసి అని, దేశవ్యాప్తంగా అనేక బాంబు పేలుళ్లలో కూడా అన్సారీ హస్తం ఉందని అనుమానిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.

 

ansari

పెరోల్ పై బయటకు:
రాజస్థాన్ లోని అజ్మీర్ కేంద్ర కారాగారం నుంచి 21 రోజుల పెరోల్ పొందిన జలీస్ అన్సారీ శుక్రవారం(జనవరి-17,2020) జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సి ఉంది. పెరోల్ పై బయట ఉన్న సమయంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో ముంబైలోని అగ్రిపాడ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టి రావాల్సి ఉంది. అయితే గురువారం నిర్దేశించిన సమయంలో అన్సారీ స్టేషన్ కు రాలేదు.

 

blast

మసీదుకి వెళ్లి వస్తానని చెప్పి:
గురువారం మధ్యాహ్నాం జలీస్ అన్సారీ కనిపించడం లేదంటూ ఆయన కుమారుడు జయిద్ అన్సారీ(35)పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లెయింట్ ఇచ్చాడు. ఆ ఫిర్యాదు ప్రకారం.. ఉదయం నిద్రలేచిన జలీస్ అన్సారీ నమాజ్ కోసం మసీదుకు వెళ్లి వస్తానని కుటుంబసభ్యులకు చెప్పాడు. ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. ఫిర్యాదు ప్రకారం దీనిని మిస్సింగ్ కేసుగా నమోదు చేసినట్లు స్టేషన్ అధికారి తెలిపారు. జలీస్ అన్సారీని పట్టుకునేందుకు ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్, మహారాష్ట్ర ATS రంగంలోకి దిగాయి. డాక్టర్ బాంబ్ గా పేరుపొందిన జలీస్ అన్సారీ సిమీ, ఇండియన్ ముజాహిద్దీన్ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నాడని, ఆ ఉగ్ర గ్రూపులకు బాంబుల తయారీ గురించి బోధించేవాడని తెలిపారు. 2008 నాటి ముంబై బాంబ్ బ్లాస్ట్ లో జలీస్ పాత్ర గురించి 2001లో ఎన్ఐఏ అతడిని వాచారించింది.