NIA Conduct Searches : జమ్మూ కశ్మీర్, రాజస్ధాన్ లలో ఎన్ఐఏ సోదాలు

జమ్మూ కాశ్మీర్, రాజస్ధాన్ లలో ఈ రోజు ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు కుట్ర పన్నుతుండటంతో ఎన్‌ఐఏ అలెర్ట్ అయింది.

NIA Conduct Searches : జమ్మూ కశ్మీర్, రాజస్ధాన్ లలో ఎన్ఐఏ సోదాలు

NIA conduct searches

NIA Conduct Searches :  జమ్మూ కశ్మీర్, రాజస్ధాన్ లలో ఈ రోజు ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు కుట్ర పన్నుతుండటంతో ఎన్‌ఐఏ అలెర్ట్ అయింది. ఢిల్లీతోపాటు దేశంలోని కీలక ప్రాంతాలపై ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నుతున్నారు. ఉగ్రవాదుల సంబంధాలను బట్టబయలు చేసేందుకు ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాతోపాటు జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా, గందర్‌బల్, బుద్గామ్‌లో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. లష్కరే తోయిబా, జైష్-ఎ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్ బదర్, పీపుల్ ఎగైనెస్ట్ ఫాసిస్ట్ ఫోర్సెస్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థలు దేశంలో ఉగ్రదాడులకు కుట్రపన్నాయి.

ఎన్ఐఏ జరిపిన సోదాల్లో ముఖ్యమైన పత్రాలు, డాక్కుమెంట్లు, సిమ్‌ కార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లు, డిజిటల్ స్టోరేజీ పరికరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు నిందితుల వాంగ్మూలం సేకరించింది ఎన్ఐఏ. త్వరలోనే మరికొందరికి విచారణ నిమిత్తం నోటీసులు పంపడంతో పాటు… నిందితులలో కొందరిని ఎన్ఐఏ అరెస్టు చేసే అవకాశం ఉంది.
Also Read : Cyber Security: సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం కొత్త హెల్ప్‌లైన్ నెంబర్..
ఉగ్రవాదుల కుట్రకు సంబంధించిన గతేడాది జమ్మూ కశ్మీర్‌లో కేసు నమోదు చేసిన ఎన్.ఐ.ఏ భారీ ఉగ్రదాడికి తీవ్రవాద సంస్థలు కలసికట్టుగా పనిచేస్తున్నాయన్న నిఘావర్గాల సమాచారంతో… గతేడాది జమ్మూ కాశ్మీర్‌లో కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. ఇప్పటి వరకు ఉగ్రదాడుల కుట్రకు సంబంధించిన కేసులో 28మంది నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది.