నిర్భయ దోషుల పిటిషన్ల ఆట .. ఉరి నుంచి మూడేళ్లుగా ఎలా తప్పించుకున్నారంటే?

  • Published By: sreehari ,Published On : February 5, 2020 / 11:30 AM IST
నిర్భయ దోషుల పిటిషన్ల ఆట .. ఉరి నుంచి మూడేళ్లుగా ఎలా తప్పించుకున్నారంటే?

నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ కోర్టు.. డెత్ వారెంట్ జారీ చేసినప్పటికీ నుంచి నలుగురు నిర్భయ దోషులు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం దాన్ని కోర్టులు తోసిపుచ్చడం.. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ ఇవ్వడం.. అది కూడా తిరస్కరించడంతో మళ్లీ అదే ప్రయత్నం చేస్తూ ఉరిశిక్ష కాలాన్ని పొడిగిస్తూ పోతున్నారు. మరోవైపు నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మీరట్ జైలు నుంచి తలారి మనోజ్ జల్లాద్ జనవరి 19న ఢిల్లీ చేరుకున్నాడు.

అప్పుడు తాతకు సాయంగా తలారి:
1988లో తనకు 23ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు పటియాలా సెంట్రల్ జైల్లో ఉరితీయడంలో తన తాతకు సాయంగా వచ్చాడు. ఇప్పుడు తన కెరీర్‌లో నలుగురు నిర్భయ దోషులకు ఉరి తీసేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో జల్లాద్ తీహార్ జైల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నిర్భయ దోషుల్లో ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాలను నలుగురిని ఒకేసారి ఉరి తీయటానికి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉరితాళ్లు సిద్ధమయ్యాయి. నలుగురు దోషుల బరువుకు సమానమైన ఇసుక బస్తాలతో తలారి జల్లాద్ రిహాల్సస్ చేస్తున్నాడు.

జనవరి 31న ఢిల్లీలోని పటియాలా కోర్టు పవన్ గుప్తా పిటిషన్ విచారణకు అంగీకరించింది. అయితే న్యాయపరంగా వీరికి ఉన్న అవకాశాలను వారం రోజుల్లోగా వినియోగించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోపు దోషులకు ఉన్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలి. ఇప్పటికే వినయ్, ముఖేష్ కు సంబంధించి న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయాయి. అక్షయ్‌కు సంబంధించి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. పవన్‌కు సంబంధించి క్యురేటివ్ పిటిషన్, మెర్సీ పిటిషన్ ఫైల్ చేయాల్సివుంది.

ఉరిశిక్ష ఆలస్యం కావడం ఇది రెండో సారి :
ఈ ఇద్దరు కూడా వారం రోజుల్లోగా వారికున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడంతో వీరు వారం రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జనవరి 22, 2020 తర్వాత నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా ఆలస్య కావడం ఇది రెండోసారి. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఏ చిన్న లొసుగు దొరికినా వదలడం లేదు. వాడుకుంటున్నారు. మే 5, 2017 నుంచి నలుగురు దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు. 2013, సెప్టెంబర్ 13న ట్రయల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వీరికి ఉరిశిక్ష విధించింది. పది రోజుల తర్వాత ఢిల్లీ హైకోర్టు ఈ కేసుపై విచారించింది.

కానీ, తీర్పును జనవరి 2, 2014కు వాయిదా వేసింది. ఆ తర్వాత ట్రయల్ కోర్టు మార్చి 13, 2014న వీరికి మరణ శిక్ష విధించింది. దీంతో దోషులు నలుగురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీం ఉరిశిక్షపై స్టే విధించింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత టాప్ కోర్టు మళ్లీ ఈ కేసుపై విచారించింది. 2017 నుంచి సుప్రీంకోర్టు మూడు ఏళ్లుగా మరణశిక్షను సమర్థించిన తరువాత, న్యాయపరమైన అంశాలతో మరింత ఆలస్యమవుతూ వచ్చింది. చట్టం ప్రకారం.. సుప్రీంకోర్టు విచారణ ముగిసిన తర్వాత, ఈ నలుగురు 30 రోజుల్లోపు తీర్పును సమీక్షించాలని పిటిషన్లు దాఖలు చేసి ఉండాలి. దోషి నమ్మదగిన కారణం ఇస్తే ఆలస్యాన్ని క్షమించటానికి చట్టం ఒక నిబంధన చేస్తుంది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించిన తరువాత 14 రోజుల వరకు దోషులను ఉరితీయకూడదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టే విధించడంపై ఢిల్లీ హైకోర్టుకు అప్పీల్ చేశాయి. దీనిపై ఫిబ్రవరి 2న విచారణ జరిగింది. కానీ, దీనిపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన కోర్టు.. అందరి వాదనలు ముగిసేంతవరకు ఎదురుచూడాలని సూచించింది. ఏడేళ్ల తర్వాత పాస్ట్ ట్రాక్ ఆధారంగా ట్రయల్ ప్రారంభమైంది. మరి ఏ తేదీన దోషులను ఉరితీస్తారు అనేది మాత్రం మిస్టరీగా మారింది. న్యాయపరమైన అంశాలను ఆసరగా చేసుకుని నిర్భయ దోషులు ప్రతిసారి ఉరిశిక్షను మరింత ఆలస్యం చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో ఢిల్లీ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తీహార్ జైలు అధికారులు తెలిపారు. నలుగురు దోషులకు ఒకేసారి ఫిబ్రవరి 1 ఉరి శిక్ష అమలు ఖరారైంది. జనవరి 31వ తేదీ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆదివారం (ఫిబ్రవరి 2, 2020) న సెలవు దినం అయినా సుమారు మూడున్నర గంటలపాటు విచారణ జరిపి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బుధవారం (ఫిబ్రవరి 5, 2020) ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. వారం రోజుల్లో నిర్భయ దోషులు నలుగురు చివరి అవకాశాలను వినియోగించుకుంటారా? ఇంకా ప్రొలాంగ్ కు తీసుకెళ్తారా అనేది చూడాలి మరి.