Oral Sex Is Not Aggravated Sexual Assault : ముఖ రతి నేరమే… అంత తీవ్రమైనది కాదు… అలహాబాద్ హై‌కోర్ట్

చిన్నారులతో ఓరల్ సెక్స్ అనేది తీవ్రమైన లైంగిక నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హై కోర్టు తీర్పు చెప్పింది.

Oral Sex Is Not Aggravated Sexual Assault : ముఖ రతి నేరమే… అంత తీవ్రమైనది కాదు… అలహాబాద్ హై‌కోర్ట్

Oral Sex Is Not A Aggravated Sexual Assault

Oral Sex Is Not Aggravated Sexual Assault : చిన్నారులతో ఓరల్ సెక్స్ అనేది తీవ్రమైన లైంగిక నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హై కోర్టు తీర్పు చెప్పింది. సెషన్స్ కోర్టు దోషికి   విధించిన  10 ఏళ్ళ  జైలు శిక్షను  7 ఏళ్ళకు తగ్గించి..రూ.5000 జరిమానా విధించింది. అయితే ఇలాంటి  నేరాలు శిక్షార్హమైనవేనని  ధర్మాసనం తేల్చి చెప్పింది.

బాలుడితో  ముఖ రతి చేయించుకున్న వ్యక్తిని 2018 లో  దోషిగా తేల్చిన  ఝూన్సీలోని   సెషన్స్ కోర్టు నిందితుడిపై   పోక్సో చట్టంలోని సెక్షన్ 6,10, ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును ముద్దాయి హై కోర్టులో సవాల్ చేశాడు.  కేసును విచారించిన హైకోర్టులోని జస్టిస్ అనిల్ కుమార్ ఓజాతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్…ముఖ రతి నేరమే కానీ దాన్ని తీవ్రృమైన నేరంగా పరిగణించలేమని పేర్కోంది.  దీనికి పోక్సో చట్టం లోని సెక్షన్ 4 మాత్రమే వర్తిస్తుందని… సెక్షన్ 6,10 వర్తించవని తెలిపింది. ఈ సెక్షన్ ప్రకాం దోషికి కనీసంగా 7 ఏళ్లు జైల శిక్ష విధించింది.

Also Read : AP Covid Update : ఏపీలో కొత్తగా 264 కోవిడ్ కేసులు

ఈ సంఘటన 2016, మార్చి 22న జరిగింది. దోషి అయిన వ్యక్తి   బాలుడి ఇంటికి వెళ్లి గుడికి తీసుకువెళతానని  బాలుడ్ని గుడికి తీసుకు వెళ్లాడు. అక్కడ బాలుడికి రూ. 20 ఇచ్చి అతనితో ముఖరతి చేయించుకున్నాడు. బాలుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాలుడి వద్ద డబ్బులు ఉండటం చూసిన తల్లి తండ్రులు ఆ డబ్బులు ఎక్కడివని అడిగారు.

అప్పడు బాలుడు వారికి విషయం వివరించటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసలు నిందితుడిపై ఐపీసీ సెక్షన్377 (అసహజ నేరాలు), 506 (నేరపూరిత కుట్ర), మరియు POCSO చట్టంలోని 3/4 కింద అభియోగాలు మోపారు.