పాపం పండింది : 70ఏళ్ల సన్యాసిని వెంటాడిన 38 ఏళ్ల క్రితం హత్య

  • Published By: veegamteam ,Published On : June 29, 2020 / 03:51 AM IST
పాపం పండింది : 70ఏళ్ల సన్యాసిని వెంటాడిన 38 ఏళ్ల క్రితం హత్య

పాపం పండితే పాతకాలం నాటి పాపాలన్నీవెంటాడతాయి. ఎప్పుడు దశాబ్దాల క్రితం చేసిన ఓ దారుణం 70 ఏళ్ల వృద్ధ సన్యాసిని వెంటాడింది. సంసార బంధాలను వదిలేసి క్రిష్ణా..రామా అనుకుంటున్న వయస్సులో కటకటాల వెనక్కి నెట్టింది. ఎవరా వృద్ధ సన్యాసి? ఏమా కథ తెలుసుకుందాం..

 

పాపం..సంసారాన్ని ఈదలేక భవబంధాలను వదిలించుకుని ఇలా సన్యాసిగా మారిపోయాడు అనుకుంటూ అతను చెప్పే జీవిత సత్యాలను వింటున్నారు జనం. మహానుభావుడు ఎక్కడనుంచి వచ్చాడోకానీ ఎంత మంచిమాటలు చెబుతున్నాడో అనుకున్నారు వెర్రిజనం. కానీ ఆ సన్యాసిని కొంగ జపం అని..చేసిన పాపాన్ని కప్పేసి కాషాయ బట్టలు కట్టుకుని పోలీసుల నుంచి తప్పించుకోవటానికి వేషం మార్చాడని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. హన్నా..ఏమి ఈ కలికాలం అంటూ బుగ్గలు నొక్కుకున్నారు.

 

కానీ చేసిన పాపం వెంటాడుతూ వచ్చింది. 38 ఏళ్లకిందట అతడు హత్య చేసిన విషయం బయటికి పొక్కింది. నాలుగు దశాబ్దాలుగా గుట్టుచప్పుడు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆ హంతకుణ్ని పోలీసులు ఎట్టేకేలకు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టేశారు.

 

రాజస్తాన్‌లోని కరౌలి జిల్లా దనాల్‌పూర్ ప్రాంతానికి చెందిన జిన్సీ మీనా 1982లో భూమికి సంబంధించని వివాదంలో శ్రీరాం మీనా అనే పొరిగింటిని వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తను చేసిన దారుణం గురించి పోలీసులబారిన పడకుండా ఊరి విచిడి పారిపోయాడు. శ్రీరాం హత్య కేసులో పోలీసులు అతని కోసం చాలాళ్లు గాలించారు. కానీ దొరకలేదు. కానీ జిన్సీ మీనా గురించి వెతకటం మాత్రం మానలేదు.

 

హత్య చేసిన తరువాత జిన్సీ మీనా రాజస్తాన్ వదిలేసి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో సాధువు వేషం వేసుకుని తిరిగేవాడు. ఆ సమయంలో పోలీసులు ఎక్కడన్నా కనిపిస్తే నాకోసమే వచ్చారేమోననే భయంతో దాక్కునేవాడు. అలా ఏళ్లు గడిచిపోయాయి..దశాబ్దాలు కూడా గడిచిపోయాయి. ఇక తనను ఎవరూ గుర్తుపడతారులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో తిరిగి కౌరలి జిల్లాకు వచ్చాడు.

 

గంగాపూర్ పట్టణంలోని గంగాపూర్‌లోన ఉన్న ఓ హనుమాన్ దేవాలయంలో ఆవాసం ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఉన్నవాడు ఉన్నట్లుగా ఉండకుండా అత్యుత్సాహానికి పోయాడు. ఆ ప్రాంతంలో ఉండే తన బంధుమిత్రులతో రాకపోకలు..సంబంధాలు కొనసాగించాడు. దీంతో విషయం ఆనోటా ఈనోటా పడి పోలీసులకు తెలిసింది.

 

దీంతో పోలీసులు ఇంతకాలంగా వెతుకుతున్నా దొరకని జిన్సీ మీనాపై మండిపడుతున్న పోలీసులు యదువీర్ సింగ్ నాయకత్వంలోని బందంతో గురువారం (జూన్ 25,2020) హనుమాన్ దేవాలయానికి వెళ్లి జిన్సీ మీనాను అరెస్ట్ చేశారు. వార్నీ ఎంత కేటుగాడివిరా..రాష్ట్రాలు దాటి వెళ్లిపోయావు..మళ్లీ ఇంతకాలనికి వచ్చావు..అంటే ఇక నిన్నెవరూ గుర్తు పట్టరనే కదా..అంటూ అరదండాలువేసి కటకటాల్లో పడేశారు.

 

Read: మట్టి తవ్విందనే కోపంతో కుక్కపిల్ల గొంతుకు గుడ్డ కట్టి హత్య