Uma Maheshwari : ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య.. కారణం ఏంటి? అసలేం జరిగింది?

దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగో కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు కారణం ఏంటి? ఆమె ఇంట్లో అసలేం జరిగింది?

Uma Maheshwari : ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య.. కారణం ఏంటి? అసలేం జరిగింది?

Uma Maheshwari

Uma Maheshwari : దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగో కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతోనే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

ఎన్టీఆర్ కు 12మంది సంతానం. వారిలో ఉమామహేశ్వరి చిన్న కూతురు. ఆమె మృతితో ఎన్టీఆర్ కుటుంబం, నందమూరి అభిమానుల్లో విషాదం అలుముకుంది. ఉమామహేశ్వరి మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉమామహేశ్వరి నేత్రదానం చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బుధవారం ఉమామహేశ్వరి అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమామహేశ్వరి పెద్ద కూతురు అమెరికాలో ఉంది. ఆమె వచ్చాకే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Uma Maheshwari : విషాదంలో ఎన్టీఆర్ కుటుంబం.. సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య

తన తల్లి అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఉమామహేశ్వరి చిన్న కూతురు దీక్షిత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.

ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నామని దీక్షిత తెలిపారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో అమ్మ గదిలోకి వెళ్లిందన్న దీక్షిత, భోజనం సమయం వరకు బయటకు రాకపోవడంతో తలుపులు తెరిచే ప్రయత్నం చేశామని పోలీసులకు తెలిపారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉందని కంప్లైంట్ లో తెలిపింది. మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసులకు ఫోన్ చేసింది దీక్షిత. ఉమామహేశ్వరి గత ఏడాదే తన చిన్న కూతురు వివాహం జరిపించింది. ఆ వివాహంలోనే దగ్గుబాటి, చంద్రబాబు మనసు విప్పి మాట్లాడుకున్నారు.

జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉదయం 10 గంటలకు ఉమామహేశ్వరి బెడ్ రూమ్ లోకి వెళ్లింది. రూమ్ లోకి వెళ్లే సమయంలో కూతురు, అల్లుడికి వంటలు చేయాలని చెప్పింది. అలా బెడ్ రూమ్ లోకి వెళ్లిన ఆమె..మధ్యాహ్నం 12 గంటల వరకు బయటకు రాలేదు.

మధ్యాహ్నం 12గంటల 5 నిమిషాలకు ఉమా మహేశ్వరి ఆడపడుచు ఇంటికి వచ్చింది. వచ్చిన వెంటనే ఉమా మహేశ్వరి కోసం డోర్ కొట్టింది. ఎంతకీ డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఆడపడుచు.. ఉమామహేశ్వరి కూతురు, అల్లుడిని పిలిచింది. వారు కూడా వచ్చి డోర్ కొట్టినప్పటికీ డోర్ తియ్యలేదు. దీంతో 12గంటల 40 నిమిషాలకు వంట మనిషి, ఆడపడుచు, కూతురు, అల్లుడు కలిసి డోర్ పగులగొట్టారు. లోపల ఉమా మహేశ్వరి ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించి షాక్ తిన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

చున్నీతో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే చున్నీని కట్ చేసి మృతదేహాన్ని కిందకు దింపారు కూతురు, అల్లుడు. ఆ తర్వాత ఒంటి గంట సమయంలో బంధువులకు సమాచారం ఇచ్చింది కూతురు దీక్షిత. 2.30గంటలకు జూబ్లీహిల్స్ పోలీసులకు దీక్షిత ఫిర్యాదు చేసింది. 2.45 నిమిషాలకు పోలీసులు స్పాట్ కి వచ్చారు. 4.30 గంటలకు పోస్టుమార్టం నిమిత్తం ఉమా మహేశ్వరి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 6.30గంటలకు పోస్టుమార్టం పూర్తైంది. ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు డాక్టర్లు.