Jubileehills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు..వెలుగుచూస్తున్న సంచలన విషయాలు

లైంగిక దాడి జరిగే సమయంలో బాలికకు గాయాలయ్యాయి. బాధిత బాలిక శరీరంపై 12 గాయాలున్నట్లు మెడికల్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించారు.

Jubileehills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు..వెలుగుచూస్తున్న సంచలన విషయాలు

Girl Rape

Jubileehills girl rape : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లో నడుస్తున్న కారులో బాలికపై గ్యాంగ్‌ రేప్‌ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. జూబ్లీహిల్స్ పోలీసులకు అందిన బాధిత బాలిక మెడికల్ రిపోర్ట్‌లో పలు అంశాలు వెలుగుచూశాయి. ఇప్పటికే బాలికకు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు…మెడికల్‌ రిపోర్ట్‌ ఆధారంగా దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నారు. బాలిక మెడపై కొన్ని చోట్ల కమిలిపోయిన గుర్తులున్నట్లు వైద్య నివేదికలో వెల్లడయ్యింది.

లైంగిక దాడి జరిగే సమయంలో బాలికకు గాయాలయ్యాయి. బాధిత బాలిక శరీరంపై 12 గాయాలున్నట్లు మెడికల్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. మరోవైపు గ్యాంగ్ రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు…అతనిని రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. కాసేపట్లో ముగ్గురు మైనర్‌ నిందితుల వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. జువెనల్‌ హోమ్‌లో నిందిత మైనర్లను పోలీసులు ప్రశ్నించనున్నారు.

Jubileehills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు..మైనర్ల కష్టడీకి అనుమతి

ఈ కేసులో ఏ 1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ మొదటి రోజు కస్టడీ విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించారు. సాదుద్దీన్ మాలిక్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. విచారణలో అదనపు వెస్ట్ జోన్ డీసీపీ ఇక్బాల్ సిద్దికీ మరియు ఐఓ అధికారికి మాలిక్ సహకరించారు. సిసి కెమెరా ఫుటేజ్ కాల్ డేటా ముందు ఉంచి పోలీసులు విచారించారు.

విచారణలో సాదుడిన్ మాలిక్ ఐఓ అధికారికి సంచలన విషయాలు వెల్లడించారు. మైనర్ లతో తనకి రెండు నెలల ఫ్రెండ్ షిప్ ఉంది. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుతో నేను ఇన్నోవా కారులో పబ్ కి వచ్చాను. మమల్ని జమిల్ అనే ఇన్నోవా డ్రైవర్ పబ్ వద్దకు తీసుకువచ్చాడు. మొదట బాలికను వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కొడుకు కలిశాడు. ఆ తరవాత నేను అనుసరించాను. బాలిక బయటకు వచ్చిన అనంతరం నాతో పాటు మైనర్లు పరిచయం చేసుకున్నాము. ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని చెప్పడంతో బాలిక మాతో పాటు బెంజ్ కారులో వచ్చింది.

Jubilee Hills Gang Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. మరోసారి బాలిక స్టేట్‎మెంట్ రికార్డు.. కీచకులను గుర్తించింది

ఇన్నోవా కారు పబ్ వద్ద పార్క్ చేసి జమీల్ అనే డ్రైవర్ వెళ్ళి పోయాడు. అనంతరం అమ్మాయితో మైనర్లు బెంజ్ కారులో ఉండగా నేను ఇన్నోవా కారులోనే బెంజ్ కారు వెనుకే అనుసరించాను. సాదూద్దీన్ మాలిక్ ను ఈ నెల 3న రిమాండ్ చేసే సమయంలో చెప్పిన 8 పేజీల స్టేట్ మెంట్ విషయాలను ఇటీవలే బాలిక రెండవ సారి స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ నెల 7న ఇద్దరు మైనర్ లు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా మాలిక్ ను పోలీసులు పలు కోణాల్లో విచారించారు.