మూడేళ్ల బాలికపై హత్యాచారం..నిందితుడికి మరణశిక్ష

  • Published By: madhu ,Published On : December 20, 2019 / 06:39 AM IST
మూడేళ్ల బాలికపై హత్యాచారం..నిందితుడికి మరణశిక్ష

ముక్కుపచ్చలారని మూడేళ్ల పాపను అమానుషంగా అత్యాచారం చేసి చంపేసిన కామాంధుడికి కోర్టు మరణ శిక్షను విధించింది. కిరాతకమైన, క్షమించారని నేరం చేశాడని కోర్టు వ్యాఖ్యానించింది. అదనపు జిల్లా కోర్టు జడ్జి సునీల్ కుమార్ ఈ తీర్పును వెలువరించారు. అయితే..తాను అమాయకుడినంటూ..హైకోర్టుకు వెళుతానంటున్నాడు. ఈ కేసు తీర్పుపై హర్షాతీరేకాలు వ్యక్తమౌతున్నాయి. 

ఇక ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…
చంపువా పీఎస్ పరిధిలోని సునీల్ కుమార్ నాయక్ అనే వ్యక్తి తరచూ బంధువుల ఇంటికి వెళుతుండే వాడు. ఆ బంధువులకు మూడేళ్ల పాప ఉంది. చిన్నారిపై కన్ను పడింది ఈ కామాంధుడికి. 2017, జనవరి 13వ తేదీన తల్లిదండ్రులు లేని సమయం చూసి చిన్నారిని ఎత్తెకెళ్లాడు. నిర్మానుష్యమైన ప్రదేశంలో అత్యాచారనికి పాల్పడ్డాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో తన నేరం బయటపడుతుందని సునీల్ భయపడిపోయాడు.

దీంతో ఆ చిన్నారి పీక పిసికి హత్య చేశాడు. ముళ్లపోదలో విసిరేసి ఏమీ ఎరుగనట్లు ఇంటికి వచ్చాడు. తమ కుమార్తె కనిపించడం లేదని పీఎస్‌లో కంప్లయింట్ చేశారు తల్లిదండ్రులు. బాలిక ఆచూకీ కోసం వెతకగా..ముళ్లపోదలో విగతజీవిగా కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు సునీల్ కుమార్‌పై అనుమానం కలిగింది. ఇతడిపై IPC సెక్షన్ 6, ఫోక్సో యాక్టు ప్రకారం కేసులు బుక్ చేశారు.

అనంతరం అరెస్టు చేశారు. 28 మంది సాక్షులను విచారించారు. కోర్టులో వీరి వాంగూల్మాన్ని తీసుకుని సునీల్‌ దోషి అని నిర్ధారించింది. ఒడిశా కోర్టు మరణ శిక్ష విధించడం గొప్ప పరిణామంగా భావిస్తున్నారు. 
Read More : CAA : రజనీ ట్వీట్‌పై రచ్చ రచ్చ