Srinagar Grenade Blast : రిపబ్లిక్ డేకు ముందు.. శ్రీనగర్​లో గ్రెనేడ్​ దాడి.. నలుగురికి తీవ్రగాయాలు

గణతంత్ర వేడుకులకు ముందు రోజున జమ్ముకశ్మీర్​‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్రెనేడ్​ బాంబులతో తెగబడ్డారు.

Srinagar Grenade Blast : రిపబ్లిక్ డేకు ముందు.. శ్రీనగర్​లో గ్రెనేడ్​ దాడి.. నలుగురికి తీవ్రగాయాలు

Srinagar Grenade Blast 4 In

Srinagar Grenade Blast : గణతంత్ర వేడుకులకు ముందు రోజున జమ్ముకశ్మీర్​‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం (జనవరి 25) శ్రీనగర్ పట్టణంలో గ్రెనేడ్​ బాంబులతో తెగబడ్డారు. రిపబ్లిక్​డే వేడుకలకు ఒక రోజు ముందు ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడికి పాల్పడటం తీవ్ర కలకలంగా మారింది. స్థానికంగా ఉన్న హైస్ట్రీట్​ వద్ద సాయంత్రం సమయంలో బాంబులతో దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల ప్రకారం.. భద్రత సిబ్బందిని టార్గెట్​గా చేసుకుని ఉగ్రవాదులు ఈ గ్రెనెడ్ దాడికి పాల్పడారు. ఉగ్రవాదుల గ్రేనెడ్ దాడితో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భీకరంగా మారిపోయింది. ఈ బాంబు దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. బాంబు దాడి ఘటనతో స్థానికులంతా భయంతో దూరంగా పరుగులు పెట్టారు.

గాయపడిన వారిలో భద్రత సిబ్బంది సహా ఇద్దరు మహిళ​లు ఉన్నారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి భారీ ఎత్తున మోహరించారు. బాంబుదాడిలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్యంకోసం సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాండు దాడి ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రత అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.


ఇంకా ఏమి అయినా పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న కోణంలో భద్రతా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగి ఉన్నారనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Read Also : Somu Veerraju : 2024లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం-సోము వీర్రాజు