SI Plan for Murder of Cconstable : మాజీ నక్సలైట్‌కు సుపారీ ఇచ్చి..కానిస్టేబుల్ హత్యకు SI మాస్టర్ ప్లాన్..!!

మాజీ నక్సలైట్‌కు సుపారీ ఇచ్చి..కానిస్టేబుల్ హత్యకు SI మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ కుట్రను భగ్నం చేశారు హైదరాబాద్ నిఘా విభాగం పోలీసులు.

SI Plan for Murder of Cconstable : మాజీ నక్సలైట్‌కు సుపారీ ఇచ్చి..కానిస్టేబుల్ హత్యకు SI మాస్టర్ ప్లాన్..!!

SI plan for murder of constable In Telangana

SI plan for murder of constable In Telangana : ములుగు జిల్లాలో కానిస్టేబుల్ హత్యకు ఏఆర్ ఎస్‌ఐ వేసిన పక్కా ప్లాన్ తెలిసి ఉన్నతాధికారులు సైతం షాక్ అయ్యారు. పోలీస్ డిపార్ట్ మెంట్ మెప్పు కోసం ఓ ఎస్సై కానిస్టేబుల్ ను హత్య చేయటానికి పక్కా ప్లాన్ వేశాడు. ఓ మాజీ నక్సలైట్ కు సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశాడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ములుగు జిల్లాలో కేంద్రంగా సాయుధ దళం ఏర్పాట్లుకు పక్కా ప్లాన్ వేశాడు ఎస్సై. మావోయిస్టులు ఉన్నారనే భ్రమ కల్పించి.. ఆ తర్వాత కానిస్టేబుల్ ను హత్య చేయటానికి ప్లాన్ వేశాడు.కానీ ప్లాన్ అమలు కాకముందే హైదరాబాద్‌లోని పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం ఎస్సై ప్లాన్ ను పక్కాగా భగ్నం చేసింది. దీంతోసదరు ఎస్సై చేసిన దారుణమైన కుట్ర బయటపడింది. మాజీ నక్సలైట్ కు సుపారీ ఇచ్చి కానిస్టేబుల్ ను హత్య చేయించాలనుకున్న ప్లాన్ బట్టబయలు అయ్యింది. హైదరాబాద్ నిఘా విభాగం ఈ కుట్రను ఛేధించి సదరు ఎస్సై తో సహా సుపారీ తీసుకున్న మాజీ నక్సలైట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఇటీవలే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు ఎస్ఐలపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వరంగల్ కమిషనర్ పరిధిలోని గీసుకొండ పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకటేశ్వర్లు, దామెర ఎస్సై హరిప్రియ వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో వీరిద్దని సస్సెండ్ చేశారు ఉన్నతాధికారులు. లైంగిక వేధింపులు పాల్పడుతున్న మరో ఎస్సై పున్నం చంద్రను కూడా సస్పెండ్ కు గురి అయ్యాడు. ఈ ఘటనలు మర్చిపోకముందే ములుగు జిల్లాలో ఓఎస్సై కానిస్టేబుల్ ను హత్య చేయటానికి మాజీ నక్సలైట్ కు సుపారీ ఇవ్వటం బటయపడటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసు శాఖ వివాదాస్పదంగా మారింది.

తనకు సహకరించిన వారిని ఎన్‌కౌంటర్ చేసి అధికారుల మెప్పు పొందాలని చూసినట్టుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్‌లోని పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం దీన్ని పసిగట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాంకేతికతో కొన్ని ఆధారాలను సేకరించిన అధికారులు.. పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ ఏఆర్ ఎస్‌ఐతో పాటు మరో ఇద్దరిని పోలీసుల స్పెషల్ టీమ్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కాగా ములుగు జిల్లాలో ఏఆర్ ఎస్‌ఐ మావోయిస్టులు మాదిరిగా ఓ దళాన్ని ఏర్పాటు చేయటానికి ప్లాన్ వేశాడు. దీని కోసం మాజీ నక్సలైట్ సాయం తీసుకున్నాడు. నక్సలైట్లు ఉన్నారనే భ్రమ కల్పించేలా ఓ కానిస్టేబుల్‌ను హత్య చేయించేందుకు ప్లాన్ వేశాడు. దీని కోసం ఎవ్వరికి అనుమానంరాకుండా అది హత్య అని తెలియకుండా నక్సలైట్లే కానిస్టేబుల్ ని చంపారని క్రియేట్ చేయటానికి ములుగు జిల్లాలోని తాడ్వాయి అడవుల్లో ట్రయల్స్ కూడా నిర్వహించారు.

సదరు ఎస్సై ఏర్పాటు చేసుకున్న దళంతో కానిస్టేబుల్‌ను హత్య చేయించి.. ఆ తర్వాత వారిని కూడా అంతం చేయాలని సదరు ఎస్‌ఐ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. సదరుదళం తనను మీట్ అవ్వటానికి వచ్చే సమయంలో ఎన్‌కౌంటర్ చేయాలని ఎస్‌ఐ ప్లాన్ వేసుకున్నాడు. అంటే తాను సుపారీ ఇచ్చి హత్య చేయించిన విషయం బయటపడకుండా నక్సలైట్లను కూడా ఎన్ కౌంటర్ చేస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ప్లాన్ చేశాడు. కానీ రెండు పనులు జరగలేదు.
ఈ కుట్రకు సంబంధించిన అన్ని వివరాలు సేకరించి సదరు కానిస్టేబుల్ ను అప్రమత్తం చేసి ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు.

తనకు సహకరించిన పోలీసు ఉన్నతాధికారుల మెప్పు పొందటానికి కానిస్టేబుల్ ను హత్య చేయించాలని అనుకున్న ప్లాన్ తో పాటు నక్సలైట్లను తుదముట్టించిన ఎస్సైగా పేరు పొందాలనే ప్లాన్ బెడిసికొట్టింది. హైదరాబాద్‌లోని పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం గుట్టు రట్టు చేయటంతో తానే పోలీసుల చేతికి చిక్కాడు తాను సుపారీ ఇచ్చిన మాజీ నక్సలైట్ తో సహా..ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టల కథ కంచికి వెళ్లకుండానే బెడిసికొట్టి అడ్డంగా బుక్ అయ్యాడు సదరు ఎస్సై..