Terrorists In Tirumala : తిరుమలలో ఉగ్రవాదులు లేరు, భక్తులు ఆందోళన చెందొద్దు- ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

Terrorists In Tirumala : కొండపై ఉగ్రవాదులు ఉన్నట్టు తమకు మెయిల్ వచ్చిన మాట వాస్తవమే అన్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది వెరిఫై చేస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

Terrorists In Tirumala : తిరుమలలో ఉగ్రవాదులు లేరు, భక్తులు ఆందోళన చెందొద్దు- ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

Tirumala Alert (Photo : Google)

Terrorists In Tirumala : తిరుమల కొండపై నెలకొన్న టెన్షన్ కు ఫుల్ స్టాప్ పడింది. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారనే ఘటనపై 10టీవీతో మాట్లాడారు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. కొండపై ఉగ్రవాదులు ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చారు ఎస్పీ. దీంతో భక్తులంతా ఊపిరిపీల్చుకున్నారు.

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి నిలయమైన తిరుమల కొండపై ఉగ్రవాదులు ఉన్నారంటూ పోలీసులకు ఈమెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులుకు ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. దాంతో టీటీడీ విజిలెన్స్, పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే తిరుమల కొండపై తనిఖీలు చేపట్టారు. అణువణువూ గాలించారు. తిరుమలను జల్లెడ పట్టారు.

Also Read..Tirumala High Alert : తిరుమలలో హైఅలర్ట్.. ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం

దీనిపై జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి 10టీవీతో మాట్లాడారు. కొండపై ఉగ్రవాదులు ఉన్నట్టు తమకు మెయిల్ వచ్చిన మాట వాస్తవమే అన్నారు. అయితే, అది ఫేక్ మెయిల్ గా తేల్చామన్నారు. భక్తులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు. మంగళవారం జరగాల్సిన దర్శనాలు యధావిధిగా జరుగుతాయని తెలిపారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది వెరిఫై చేస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు.