Uttar Pradesh: చెరుకు తోటకు వెళ్లిన రైతును చంపిన పులి.. మూడు నెలల్లో ఆరుగురి మృతి

పెద్ద పులి దాడిలో రైతు మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌, దక్షిణ ఖేరి అటవీ ప్రాంతంలో శనివారం జరిగింది. పశుగ్రాసం కోసం చెరుకు తోటకు వెళ్లిన రైతుపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో రైతు తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Uttar Pradesh: చెరుకు తోటకు వెళ్లిన రైతును చంపిన పులి.. మూడు నెలల్లో ఆరుగురి మృతి

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. రైతుపై దాడి చేసి చంపేసింది పెద్ద పులి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఖేరి అటవీ ప్రాంతం, మహేష్ పూర్ పరిధిలోని బాకార్‌గంజ్ అనే గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది.

Maharashtra: లిజ్ ట్రస్‌ను ఆదర్శంగా తీసుకుని ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలి.. ‘మహా’ ప్రతిపక్ష నేతల డిమాండ్

వీర్‪పాల్ అనే రైతు తన కొట్టంలోని పశువులకు గ్రాసం కోసం దగ్గరలోని చెరుకు తోటకు వెళ్లాడు. అక్కడ చెరుకు తోటలో గ్రాసం సేకరిస్తుండగా, అక్కడికి వచ్చిన పెద్దపులి అతడిపై దాడి చేసింది. వెంటనే గమనించిన స్థానికులు, అతడ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పులి అతడ్ని వదిలేసి అక్కడ్నుంచి పారిపోయింది. వెంటనే తీవ్రంగా గాయపడ్డ వీర్‪పాల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీర్‪పాల్ మరణించాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో చర్యలు చేపట్టారు.

Kangana Ranaut: కంగనా బీజేపీలోకి రావొచ్చు.. కానీ షరతులివే: జేపీ నద్దా

పులిని బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో పెద్ద పులులు, చిరుత పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఇక్కడ పులి దాడిలో ఆరుగురు మరణించారు.