Crime news: రోడ్డుపై గొడవపడ్డ 17 మంది యువకులు.. పక్కకు వెళ్లాలని చెప్పినందుకు స్థానికుడిని కర్రలతో కొట్టి చంపిన వైనం

కొందరు యువకులు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఘర్షణకు దిగారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ యువకులకు అక్కడ నివాసం ఉండే పశుపతి నాథ్ సింగ్, ఆయన కుమారుడు రాజన్ సింగ్ చెప్పారు. దీంతో ఆ తండ్రీకొడుకులపైకి 17 మంది దూసుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. పశుపతి నాథ్, ఆయన కుమారుడు రాజన్ సింగ్ తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పశుపతి నాథ్ ప్రాణాలు కోల్పోయాడు.

Crime news: రోడ్డుపై గొడవపడ్డ 17 మంది యువకులు.. పక్కకు వెళ్లాలని చెప్పినందుకు స్థానికుడిని కర్రలతో కొట్టి చంపిన వైనం

Stabbing

Crime news: కొందరు యువకులు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఘర్షణకు దిగారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ యువకులకు అక్కడ నివాసం ఉండే పశుపతి నాథ్ సింగ్, ఆయన కుమారుడు రాజన్ సింగ్ చెప్పారు. దీంతో ఆ తండ్రీకొడుకులపైకి 17 మంది దూసుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. పశుపతి నాథ్, ఆయన కుమారుడు రాజన్ సింగ్ తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పశుపతి నాథ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని వారణాసీలో చోటు చేసుకుంది.

రాజన్ సింగ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో 17 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో తీవ్రత దృష్ట్యా ఇద్దరు కానిస్టేబుళ్లు సహా తొమ్మిది మంది పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. రోడ్డుపై గొడవపడడమే కాకుండా, పశుపతి నాథ్ ప్రాణాలు తీసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..