వివేకా హత్య : కోర్టును ఆశ్రయించిన జగన్

  • Published By: veegamteam ,Published On : March 19, 2019 / 04:02 PM IST
వివేకా హత్య : కోర్టును ఆశ్రయించిన జగన్

విజయవాడ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సిట్ విచారణ వల్ల వాస్తవాలు బయటకు రావన్నారు. ఈ హత్యను చిన్నదిగా చూపించి.. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని పటిషన్ లో తెలిపారు. 

ఈ కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సహా 8 మందిని ప్రతివాదులుగా చేస్తూ హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం శాఖ, ఏపీ డీజీపీ, కడప ఎస్పీ, సిట్ బృందం, పులివెందుల హౌజ్ ఆఫీసర్ పై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ పోలీసుల అజమాయిషీ ఉందన్నారు. 

స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయిస్తేనే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు బయటికి వస్తారని జగన్ పిటిషన్ లో తెలిపారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ అవసరాల కోసం తన చిన్నాన్న హత్య కేసును వాడుకుంటున్నారని ఆరోపించారు. దీన్ని సాధారణ హత్యగా పరిగణిస్తున్నారని..సిట్ విచారణ పట్ల తనకు నమ్మకం లేదన్నారు. సీబీఐతో పూర్తి స్థాయి విచారణ జరిపిస్తేనే హత్య కేసులో ఎవరెవరున్నారన్నది బటయటికి వస్తుందని పిటిషన్ లో తెలిపారు.