Rape In Public Toilet : ఘోరం.. పబ్లిక్ టాయిలెట్‌లో మహిళపై అత్యాచారం

దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై నిత్యం అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పబ్లిక్ టాయిలెట్ లో మహిళపై అత్యాచారానికి..(Rape In Public Toilet)

Rape In Public Toilet : ఘోరం.. పబ్లిక్ టాయిలెట్‌లో మహిళపై అత్యాచారం

Rape In Public Toilet

Rape In Public Toilet : నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా మహిళకు రక్షణ దొరకడం లేదు. రేప్ కేసుల్లో నిందితులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై నిత్యం అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు… అందరూ అఘాయిత్యాలకు బలవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పబ్లిక్ టాయిలెట్ లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Tamilnadu : భర్తకు షాక్.. పెళ్లి అయిన నెలకే ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇల్లాలు

ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ కు చెందిన 20 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి రైల్వే స్టేషన్ కు వెళ్లింది. ఇద్దరూ అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉంది. ఆ ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, ఆహార పదార్ధాలు కొనేందుకు ఆమెను అక్కడే వదిలి భర్త వెళ్లాడు. అదే సమయంలో ఆమె రైల్వే స్టేషన్ పార్కింగ్ స్టాండ్ బయట ఉన్న టాయిలెట్ కి వెళ్లింది.

Youtuber : రోడ్డు ప్రమాదంలో నటి మృతి-కొబ్బరి బోండాలలో ఆల్కహాలే కారణం ?

అయితే, అక్కడ జనాలు ఉండటంతో ఆమె వెనక్కి వచ్చేసింది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితుడు.. ఆమె దగ్గరికి వెళ్లాడు. ఏదో కంగారులో ఉన్నట్టు కనిపిస్తున్నారు, మీకు ఏదైనా సాయం చేయాలా అని ఆమెను అడిగాడు. తాను వాష్ రూమ్ కి వెళ్లాలని ఆమె చెప్పింది. దీంతో ఆ వ్యక్తి తన దగ్గర మరో టాయిలెట్ రూమ్ కీస్ ఉన్నాయని, అవసరమైతే వాడుకోవచ్చని చెప్పాడు. కీస్ తీసుకున్న మహిళ.. టాయిలెట్ లోకి వెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన నిందితుడు టాయిలెట్ లోకి దూరాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బిత్తరపోయిన మహిళ గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు ఉన్న చుట్టుపక్కల వారు అక్కడికి పరుగున వచ్చారు. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.(Rape In Public Toilet)

Karnataka : విడాకులు కోరిన భార్యను విచక్షణా రహితంగా కత్తితో పొడిచిన భర్త

టాయిలెట్ లో అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తోటి ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని గుర్తించి పట్టుకునే పనిలో ఉన్నారు.

Social Media : న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని వేధింపులు-అరెస్ట్ చేసిన పోలీసులు

సమాజంలో రోజురోజుకు కామాంధులు ఎక్కువైపోతున్నారు. ఆడవారికి ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్భయ, దిశ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.