AP Inter Results : కృష్ణా టాప్

  • Published By: madhu ,Published On : April 12, 2019 / 05:50 AM IST
AP Inter Results : కృష్ణా టాప్

ఏపీ ఇంటర్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ను ఇంటర్ బోర్డు కార్యదర్శి విజయలక్ష్మి వెల్లడించారు. ఎప్పటిలానే అమ్మాయిలే టాప్ లో నిలిచారు. ఇంటర్ సెకండియర్‌లో 75 శాతం అమ్మాయిలు…అబ్బాయిలు 68 శాతంగా ఉన్నారని తెలిపారు. ఇంటర్ సెకండియర్ లో 72 శాతం ఉత్తీర్ణత ఉందన్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో 60 శాతం ఉత్తీర్ణత వచ్చిందన్నారు. ఇందులో కూడా బాలికలే టాప్‌గా నిలిచినట్లు వెల్లడించారు.

ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత ఉందన్నారు. ఇంటర్ ఒకేషన్‌లో 69 శాతం పాస్ అయ్యారని తెలిపారు. కృష్ణా జిల్లా 81 శాతంతో టాప్‌‌లో నిలిచినట్లు..చిత్తూరు 76 శాతం, నెల్లూరులో 74 శాతం వచ్చిందన్నారు.

–  గవర్నమెంట్ స్కూల్ విషయానికి వస్తే విజయనగరం 71.7 శాతంతో టాప్‌లో నిలవగా చిత్తూరు 74 శాతంతో రెండో ప్లేస్‌లో ఉందన్నారు. కర్నూలు, ప్రకాశం జిల్లాలు 69 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయని తెలిపారు.
–  ఎయిడెడ్ కాలేజీల్లో చిత్తూరు 75 శాతం, కృష్ణా 68 శాతం, వెస్ట్ గోదావరి జిల్లా 65 శాతం సాధించాయన్నారు.
–  ఒకేషనల్‌లో అమ్మాయిలు 74 శాతం, బాయ్స్ 64 శాతం సాధించారన్నారు. 

–  ఇంటర్ సెకండ్ ఇయర్ సెక్టార్ వైజ్
* గవర్నమెంట్ కాలేజీలు 65.6 శాతం
* ఎయిడెడ్ కాలేజీలు 56 శాతం
* ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలు 76.68 శాతం 

– ఇంటర్ ఫస్టియర్ 60 శాతం ఉత్తీర్ణత ఉందన్నారు. ఇందులో కూడా బాలికలే టాప్‌గా నిలిచినట్లు వెల్లడించారు. జనరల్ లో 64 శాతం, బాయ్స్ 56 శాతం ఉందన్నారు. ఒకేషనల్ విభాగంలో గర్ల్స్ 55 శాతం, బాయ్స్ 42 శాతం ఉందన్నారు. 
కృష్ణా జిల్లా 72 శాతం, వెస్ట్ గోదావరి 69 శాతం, నెల్లూరు 67 శాతం వచ్చాయన్నారు. 
– గవర్నర్ మెంట్ జూ.కాలేజీలు : విజయనగరం 59 శాతం, నెల్లూరు 55 శాతం, శ్రీకాకుళం 52 శాతం 
– ఎయిడెడ్ కాలేజీలు : వెస్ట్ గోదావరి 53 శాతం, చిత్తూరు, కృష్ణా 51 శాతం, కడప 41 శాతం.
మొదటిసారి గ్రేడింగ్ పద్ధితిలో రిజల్ట్స్ విడుదల చేశారు.