ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్స్

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. 

  • Published By: veegamteam ,Published On : January 2, 2019 / 04:23 AM IST
ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్స్

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. 

హైదరాబాద్‌:  ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. 

మొత్త ఖాళీలు: 9
టెక్నికల్ ఆఫీసర్ (సీ)-5 ఖాళీలు
క్వాలిఫికేషన్ : ప్రముఖ యూనివర్సిటీలతో పాటు గుర్తింపు పొందిన వర్శిటీల నుంచి 60 పర్సెంట్ మార్స్ తో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్)లో పాస్ అయి ఉండాలి. దీనికి సంబంధించిన రిలేటెడ్ ఫీల్డ్ లో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

ఏజ్ లిమిట్ :30 ఏళ్లు మించకూడదు.. పే స్కేల్ రూ. 21,000/-
సైంటిఫిక్ అసిస్టెంట్-4 ఖాళీలు
గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 60 శాతం మార్కులతో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ )లో పాస్ అయి..రిలేటెడ్ ఫీల్డ్ లో ఎక్స్ పీరియన్స్ ఉండాలి. 
ఏజ్ లిమిట్ : 25 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.పే స్కేల్ రూ.12,525/- 
అప్లికేషన్ : ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవాలి. ఇంటర్వ్యూ తేదీ : 2019, ఏప్రిల్ 9
అడ్రస్ : Corporate Learning and Development Centre (CLDC), NALANDA COMPLEX Near TIFR, ECIL, Hyderabad, Telangana-500062 (040) 27182222/27182279

ఫుల్ ఇన్ ఫర్మేషన్ :  www.ecil.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు..